థ‌మ‌న్‌పై మ‌హేష్‌కు ప‌ట్ట‌రాని కోపం… మ‌ళ్లీ చెడింది… త‌ల ప‌ట్టుకుంటోన్న త్రివిక్ర‌మ్‌..!

మహేష్ బాబు ఎంత సున్నిత మనస్కుడో ఆయనకు కోపం వస్తే అంతే స్థాయిలో ప్రవర్తిస్తాడు. ఇండస్ట్రీలో ఆయనను దగ్గరగా పరిశీలించిన చాలామంది జనాలు చెప్పే మాట. మహేష్ ఎవరిని నొప్పించేందుకు పెద్దగా ఇష్టపడడు. అలాగే ఒకరి వల్ల తనకు బాగా ఇబ్బంది కలిగిందని భావిస్తే వాళ్లను అంతే దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఈ విషయంలో ఎక్కడా రాజీపడడు. సర్కారు వారి పాట సినిమాకు అందించిన ఆల్బ‌మ్‌ మహేష్ బాబుకు.. ఇటు ఆయన అభిమానులకు పెద్దగా నచ్చలేదు.

Srimanthudu' collects Rs.154 crore in 25 days | Deccan Herald

అంతకుముందు అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవరు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఒకేసారి పోటీ పడినప్పుడు సరిలేరు సినిమాకు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ట్యూన్స్ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. అల‌ సాంగ్స్ అన్ని రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అసలు ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి థ‌మన్ అందించిన ట్యూన్స్ చాలా కారణం. అందుకే సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ ఫంక్షన్ లో దేవిశ్రీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడేందుకు మహేష్ ఇష్టపడలేదు.

చివరకు సర్కారు వారి పాట సినిమాకు థ‌మన్ ని తీసుకుంటే.. థ‌మన్ కూడా దెబ్బేశాడు బ్యాక్ గ్రౌం డ్ స్కోర్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు అన్న విమర్శలకు వచ్చాయి. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాకు కూడా థ‌మన్ ను తీసుకోవడం మహేష్ కు ఎంత మాత్రం ఇష్టం లేదని అంటారు. అయితే త్రివిక్రమ్, పూజహెగ్డే , థ‌మన్ ఇలా తన టీంను తీసుకుని ఎట్టకేలకు మహేష్ ను ఒప్పించాడు. దుబాయ్ లో మహేష్ ఉండగా థ‌మన్ ను తీసుకువెళ్లి మరి త్రివిక్రమ్ రాజీ చేశాడని వార్త వచ్చింది.

Trivikram: డబ్బుల్లేక ఆ నటుడి పిల్లలకు ట్యూషన్ చెప్పిన త్రివిక్రమ్..!! -  PakkaFilmy

అయితే ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యాక కూడా మళ్లీ మహేష్ కు థ‌మన్ కు మధ్య కోపం మొదటికే వచ్చిందని తెలుస్తోంది. సినిమా పనులు మొదలై ఆరు నెలలు అవుతున్న థ‌మన్ ఇప్పటివరకు ఒక్క ట్యూన్ కూడా ఇవ్వలేదట. థ‌మన్ అటు ఆహా షో, ఇటు క్రికెట్ పోటీలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఎవరి సినిమాలు కూడా పట్టించుకోకుండా పక్కన పడేసాడని అంటున్నారు. క్రికెట్ పోటీ సంస్థ నుంచి థ‌మన్ కు భారీగా రెమ్యూనరేషన్ అందటమే ఇందుకు కారణం అని గుస‌గుస‌లు ఉన్నాయి.

మనసుపెట్టి పనిచేయకపోతే ఆ ఎఫెక్ట్ కచ్చితంగా మహేష్ బాబు సినిమా ఆల్బమ్ మీద పడుతుంది. అసలు ముందే తాను థ‌మన్ వద్దని చెప్పానని కానీ.. త్రివిక్రమ్ రాజీ చేయటం వల్లే ఒప్పుకున్నానని.. ఇప్పటికే థ‌మన్ ఏమాత్రం మనసుపెట్టి పనిచేయటం లేదని.. ఇలా అయితే సినిమా ఆల్బమ్ సరిగా రాదని మహేష్ కూడా బాగా కోపంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మహేష్ – థ‌మ‌న్ మధ్య మరోసారి బాగా గ్యాప్ వచ్చిందని.. అటు ఏం చేయాలో తెలియక త్రివిక్రమ్ తలలు పట్టుకుంటున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Composer Thaman goes ga ga over teenager's performance at 'Telugu Indian  Idol' | Entertainment Music | English Manorama

Tags: film news, intresting news, latest news, latest viral news, mahesh babu, social media, social media post, telugu news, Thaman, Tollywood, tollywood news, trendy news, viral news