ఆ జిల్లాల్లో టీడీపీ క్లీన్‌స్వీప్… వైసీపీకి బోడి గుండు.. సున్నాయే గ‌తి… ?

టీడీపీ-జనసేన పొత్తు వైసీపీని బాగా భయపెడుతున్న అంశం..పైకి 175 సీట్లు గెలవడం టార్గెట్ అని చెబుతున్నారు గాని..టి‌డి‌పి సింగిల్ గా పోటీ చేసినా సరే…కనీసం మ్యాజిక్ ఫిగర్ దాటి గెలిస్తే చాలు అని వైసీపీ భావిస్తుంది. టి‌డి‌పి, జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏదొక విధంగా గెలిచి అధికారంలోకి రావచ్చు అనేది వైసీపీ చూస్తుంది. కానీ టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేస్తే..ఇంకా వైసీపీ అధికారంపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంద‌న్న టాక్ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్ప‌టికే బ‌లంగా వ‌చ్చేసింది.

పొత్తు వల్ల వైసీపీకి గట్టి దెబ్బ పడుతుంది. పొత్తు లేకపోతే కనీసం ఓట్లు చీలిపోయి ఏదొక విధంగా అధికారంలోకి వస్తామనే ఆశ వైసీపీకి ఉంది..పొత్తు ఉంటే ఆ ఆశ కూడా లేనట్లే. ఇక టి‌డి‌పి-జనసేన పొత్తు ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కొన్ని జిల్లాల్లో పొత్తు ప్రభావం బాగా ఉంటుంది. అలాగే కొన్ని జిల్లాల్లో స్వీప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రకారం టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే..ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, విశాఖ, బాపట్ల జిల్లాల్లో స్వీప్ చేయడం ఈజీ అని చెప్పవచ్చు.

ఏలూరులో 7 స్థానాలు ఉన్నాయి…దెందులూరు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి, ఏలూరు, నూజివీడు, కైకలూరు స్థానాలు ఉన్నాయి..పొత్తు ఉంటే ఈ 7 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది. అటు వెస్ట్ లో ఆచంట, పాలకొల్లు, ఉండి, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, స్థానాలు ఉన్నాయి…ఇక్కడ కూడా స్వీప్ ఖాయం. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రితో పాటు ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రిలో జ‌న‌సేన – టీడీపీ పొత్తు దెబ్బ‌తో వైసీపీ విల‌విల్లాడ‌డం ఖాయం.

ఇక కోనసీమలో రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, మండపేట సీట్లు ఉన్నాయి. ఈ ఏడు సీట్లలో పొత్తు ప్రభావం ఉంటుంది. విశాఖలో విశాఖ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, గాజువాక, భీమిలి స్థానాలు ఉన్నాయి.. వీటిల్లో కూడా గెలుపు ఖాయమే. బాపట్లలో..రేపల్లె, బాపట్ల, వేమూరు, అద్దంకి, చీరాల, పర్చూరు స్థానాలు ఉన్నాయి..ఈ 6 స్థానాల్లో కూడా టి‌డి‌పి-జనసేన స్వీప్ చేయడం ఖాయమే.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp