చైత‌న్య‌తో విడాకులు… డేరింగ్‌గా క్లారిటీ ఇచ్చేసిన నిహారిక‌..!

మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదల గత వారం రోజులుగా వార్తల్లో బాగా నానుతోంది. అటు సోషల్ మీడియాలను.. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ నిహారిక భర్త జొన్నల‌ గడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకోబోతున్నట్టు ఒక్కటే వార్తలు వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజులుగా ఇద్దరు కలిసి ఉన్నట్టు కనపడటం లేదు. దీనికి తోడు చైతన్య తన ఫేస్బుక్, ఇన్ స్టా ఖాతాల నుంచి నిహారిక ఉన్న అన్ని ఫోటోలు తీసేసాడు. అప్పటినుంచి వీరిద్దరి విడాకుల దుమారం బయలుదేరింది.

దీనిపై అటు చైతన్య కుటుంబం, ఇటు కొణిదల కుటుంబం ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం ఆ వార్తలను ఖండించనూ లేదు. పైగా చైతు, నిహారిక కూడా స్పందించలేదు. అలాగే ఇద్దరు ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవడంతో కూడా ఈ విషయం బయటపడింది. చైతు – నిహారిక మధ్య మనస్పర్ధలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయని చిరంజీవి సైతం వీరిద్దరిని పిలిచి వార్నింగ్ ఇచ్చినా వీరిద్ద‌రిలో మార్పు లేదని కూడా ఇండస్ట్రీలో పుకార్లు నడుస్తున్నాయి.

తాజాగా నిహారిక తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. భర్త చైతన్య ఉన్న అన్ని ఫోటోలు తీసేసింది. ఒక ఫ్యామిలీ ఫోటోలో మాత్రం చైతు కనిపిస్తున్నాడు. అది కూడా ఫ్యామిలీతో కలిసి ఉండటంతో ఆ ఒక్క ఫోటో ఉంచిన నిహారిక.. తన పెళ్లి జరిగినప్పుడు పెట్టిన‌ చైతన్య ఫోటోలను కూడా డిలీట్ చేసేసింది. కేవలం తాను సింగల్ గా ఉన్న పెళ్లి ఫోటోలు మాత్రమే ఉంచింది. ఇండ‌స్ట్రీలో కూడా చాలామంది నిహారిక భర్తకు దూరం కాబోతుందంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా ఆమె ఇన్ స్టా ఖాతాలో హాఫ్ శారీ ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. వాటికి క్యాప్షన్ అయితే ఏమీ రాయలేదు.. ఏది ఏమైనా భర్త ఫోటోలు అన్ని డిలీట్ చేయడంతో పాటు చాలా గ్లామర్, రొమాంటిక్ లుక్ లో ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో.. నిహారిక తిరిగి కొత్త జీవితంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సంకేతాలు పంపిందని.. ఆమె తన దారిలోనే తాను ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మరి వీరిద్దరి జీవితం ఎలాంటి మలుపులు ? తీసుకోబోతుందో చూడాలి.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, niharika konidela, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news