ఇంత పెద్ద స్టార్ హీరో చిరంజీవికి ఆ సినిమాలు ఎందుకు క‌లిసి రావ‌ట్లేదు…!

తెలుగు తెర వెలుగు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. చిరు మొదటి నుండి మాస్ సినిమాలనే చేసుకుంటూ వచ్చారు. ఆ మాస్ సినిమాలే అతనిని సూపర్ స్టార్ ని చేశాయని చెప్పుకోవాలి. తనదైన డాన్సులు, ఫైట్స్, నటనతో మెగాస్టార్ గా వెలుగొందారు, నేటికీ ఆ ఛరిష్మాని కొనసాగిస్తున్నారు చిరు. తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరువాత చెప్పుకోదగ్గ నటుడు మన మెగాస్టార్. ఎలాంటి పాత్రనైనా అలవోకగా రక్తి కక్తికట్టించగల్గిన ఏకైక నటుడు చిరంజీవి.

Rudraveena | Cinema Chaat

 

ఈ క్రమంలోనే అతగాడిని కొన్ని సినిమాలు సంపూర్ణ నటుడిగా నిలబెట్టాయి, కానీ ఆయా సినిమాలు మాత్రం కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేకపోవడం గమనార్హం. అయితే దానికి కారణం లేకపోలేదు… ఆయా సినిమాలలో మాస్ హీరో చిరంజీవి చాలా క్లాస్ గా కనిపిస్తాడు. దాంతో అప్పటి దాక చిరంజీవిని మాస్ గా చూసిన జనాలు అంత క్లాస్ గా చూడలేకపోయారు.

అప్పటికే చిరంజీవి అంటే ఫైట్స్, డాన్స్ సినిమాలో ఖచ్చితంగా ఉండాలి అనే నియమం జనాలు ఏర్పరుచుకున్నారు. వాటిని ఆశించే చిరు సినిమాలకు వెళ్లేవారు.అలా రిలీజై చిరుకి మంచి పేరు తెచ్చిపెట్టి, సరిగ్గా ఆడని సినిమాల గురించి తెలుసుకుందాం. కె విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఆపద్భాందవుడు’ అనే సినిమా బాక్సఫీస్ వద్ద ప్లాప్ కాగా చిరంజీవి యాక్టింగ్ కి చాలా మంచి మార్కులే పడ్డాయి. అదే విధంగా రుద్రవీణ సినిమా కూడా ఇలాంటి ఫలితాన్నే ఇచ్చింది.

అందుకే అక్కడినుండి చిరంజీవి సాఫ్ట్ సినిమాలు చేయకుండా మళ్లీ మాస్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పటికి చిరంజీవి మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుతం అయితే చిరు భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కి మెహర్ రమేష్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమా అజిత్ హీరోగా తమిళ్ లో వచ్చిన వేదలమ్ సినిమాకి రీమేక్ అన్న సంగతి విదితమే.

Tags: chirangivi, film news, filmy updates, intresting news, latest news, latest viral news, mega news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news