డైరెక్టర్లుగా కూడా అదరగొట్టిన స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తారు అనడానికి ఇదే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సినిమా పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు నటిస్తూనే దర్శకరాళ్లుగా మారి ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో మొదటగా చెప్పుకోవలసినది నటి “విజయ నిర్మల” గురించి. ఈమె మీనా అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించి, సూపర్ హిట్ దర్శకురాలిగా మారిపోయింది.

ఈ క్రమంలో ఈమె ఎక్కువ సినిమాలకు దర్శకత్వ వహించిన తొలి మహిళగా “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు”లో కూడా చోటు సంపాదించడం విశేషం. ఆ తరువాత అలనాటి మేటి మహానటి “సావిత్రి” గురించి చెప్పుకోవాలి. “చిన్నారి పాపలు” అనే సినిమా ద్వారా సావిత్రి మెగా ఫోన్ పట్టుకుంది. తరువాత కూడా ఆమె కొన్ని సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించింది.

I am being targeted: Jeevitha Rajasekhar- Cinema express

కానీ ఇవేవీ ఆమెకి పెద్దగా కలిసిరాలేదని చెప్పుకుంటారు. తరువాత నటి “రేవతి” గురించి చెప్పుకోవాలి. ఈమె తెలుగు, కన్నడ,తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే డైరెక్టర్ గా మారి ముంబై కటింగ్, కేరళ కేఫ్ వంటి కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించింది. ఆ తరువాత చెప్పుకోదగ్గ నటి “జీవిత రాజశేఖర్.” ఈమె తన భర్త అయినటువంటి రాజశేఖర్ నటించిన సినిమాలు ఎవడైతే నాకేంటి, శేషు, ఆప్తుడు, సత్యమేవ జయతేలకు దర్శకత్వం వహించి దర్శకురాలిగా మారిపోయారు.

Renu Desai changes her mind on making a comeback

ఆ తరువాత పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి “రేణు దేశాయ్” గురించి చెప్పుకోవాలి. ఈమె కొన్ని సినిమాల్లో నటించాక ఆమెనే సొంతంగా స్టోరీ రాసుకొని మరీ “ఇష్క్ వాలా లవ్” అనే సినిమాని తెరకెక్కించి దర్శకురాలిగా మారిపోయింది. ఇక చివరగా “కంగనా రనౌత్” గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఈమె తొలిసారిగా మణికర్ణిక అనే సినిమా కోసం మెగా ఫోన్ పట్టి దర్శకురాలిగా మారిపోయింది.