పెళ్లి దాకా వ‌చ్చిన వ‌ర‌ల‌క్ష్మి – విశాల్ ప్రేమ ఎందుకు బ్రేక‌ప్ అయ్యింది.. విల‌న్ ఎవ‌రు..!

తండ్రి శరత్ కుమార్ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. తండ్రిని మించిన కూతురుగా న‌ట‌న‌లో గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మికి హీరోయిన్ పాత్రలో అంతగా గుర్తింపు రాకపోవడంతో.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి నెగటివ్ రోల్స్ లో అదరగొడుతుంది.

Varalakshmi hated marriage due to this famous actor.. ?

అయితే గతంలో వరలక్ష్మి విశాల్ ని ప్రేమించింద‌ని.. వారిద్దరికీ బ్రేకప్ అయిందని.. దాంతో వరలక్ష్మి పెళ్లి పై ఆసక్తి చూపించడం లేదంటు వార్తలు వినిపించాయి. ఇక అసలు విషయానికొస్తే ఇటీవల ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వరలక్ష్మి.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆశ్చర్యకరంగా సమాధానాలు చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని రిపోర్టర్ అడిగగా ఆమె చాలా డిఫరెంట్ గా సమాధానం చెప్పింది. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి..? పెళ్లి చేసుకొని రోజు ఒక్కడే ముఖమే చూస్తూ ఉండాలా..? అంటూ బోల్డ్ క‌మెంట్స్ చేసింది.

ఈ కామెంట్స్ చూస్తుంటేనే ఆమె ఎంత డేరింగ్ ప‌ర్స‌నో తెలుస్తోంది. అక్క‌డితో ఆగ‌ని వ‌ర‌ల‌క్ష్మి అమ్మాయిలని మాత్రమే ఎప్పుడు ? పెళ్లి చేసుకుంటావని ఎందుకు అడుగుతారు..? సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోని పెళ్లెప్పుడు అని ఎవరు అడగరు.. ఆడ‌వాళ్లు ఎవ్వ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా వాళ్ల కాళ్ల మీద వారే నిల‌బ‌డ‌తార‌ని బ‌దులిచ్చింది.

I lost many photo opportunities because I asked to share the bed! Is this  the case for Varalakshmi Sarathkumar? Bagheer interview! - Time News

ఇక విశాల్‌ను ఎంతో ఘాడంగా ప్రేమించిన వ‌ర‌ల‌క్ష్మి ప్రేమ‌కు తండ్రి శ‌ర‌త్‌కుమారే పెద్ద‌విల‌న్‌లా అడ్డు ప‌డ్డాడ‌ని అంటారు. విశాల్‌ను త‌ప్ప ఎవ‌రిని పెళ్లి చేసుకున్నా ఇష్ట‌మే అని తెగేసి చెప్ప‌డంతో తండ్రి మాట కాద‌న‌లేకే వ‌ర‌ల‌క్ష్మి ఇంకా పెళ్లికి దూరంగా ఉంద‌ని అంటారు. తాను అనుకున్న‌ది సాధించే మొండిత‌నం వ‌ల్లే అటు తండ్రికి ఎదురు చెప్ప‌కుండా.. ఇటు పెళ్లి చేసుకోకుండా ఆమె ఇప్ప‌ట‌కీ అలాగే ఉండిపోయింద‌ని కోలీవుడ్ జ‌నాలు చెపుతుంటారు.