హీరోయిన్ సౌందర్య చనిపోక ముందు ఆమె నెరవేరని కోరిక తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

దివంగత నటి సౌందర్య.. అలనాటి అందాల తార.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ సావిత్రి తర్వాత మహానటిగా అంత గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, క‌న్న‌డ , మ‌ళ‌యాళ‌ భాషల్లో కొన్ని వందల సినిమాల్లో నటించిన సౌందర్య టాలీవుడ్ లో అగ్ర తారలందరి సరసన నటించి మెప్పించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

Soundarya with Family | husband raghu & Mother - YouTube

సౌందర్య కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాల్లో అభిమాన హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. 2004లో బిజెపి త‌ర‌పున పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి సీహెచ్‌. విద్యాసాగ‌ర్‌రావు ఎన్నిక‌ల ప్రచారం కోసం ఫ్లైట్లో కరీంనగర్‌కు వస్తుండగా విమాన ప్రమాదంలో చనిపోయింది. తన కట్టు, బొట్టు, అందం, అభినయంతో కుటుంబ నేపథ్యంలో ఉన్న సినిమాలలో నటించి ఎంతోమంది కుటుంబ ప్రేక్షకుల ఆదరణ పొందింది సౌందర్య.

Late Actress Soundarya | Family Rift | Properties - Filmibeat

ఆమె చ‌నిపోవ‌డానికి యేడాది ముందే త‌న సొంత మేన‌బావ‌నే ఆమె పెళ్లి చేసుకుంది. సౌంద‌ర్య చనిపోయి చాలా కాలం అయినా కోట్లాదిమంది గుండెల్లో తన అందమైన చిరునవ్వుతో చెరగని ముద్ర వేసుకుంది.
సౌందర్య చనిపోకముందు ఆమెకు ఒక చిరకాల కోరిక ఉండేదట. వందలాది సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సౌందర్యకి ఒక్క సినిమాకు అయినా స్వయంగా తానే దర్శకత్వం వహించాలని కోరిక ఉండేదట.

Soundarya's 44th Birth Anniversary: Remembering the evergreen actress of  Telugu cinema | The Times of India

ఆమెకు డైరెక్ష‌న్ చేయ‌డం అంటే చాలా ఇష్టం. ఆమె తన చిరకాల కోరికను స్నేహితులతో ,తల్లిదండ్రులతో ఎప్పుడు చెబుతూనే ఉండేదట. అయితే ప్రమాదవశాత్తు విమాన ప్రమాదంలో చనిపోయిన సౌందర్యకు ఆ కోరిక తీరలేదు. అలా ఆ కోరిక తీర‌కుండానే ఆమె దుర‌దృష్ట‌వ‌శాత్తు చ‌నిపోయింది.