అల్లు అర్జున్ క‌ళ్లు చెదిరే లైన‌ప్… వామ్మో ఏంటి ఈ సినిమాలు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్డ‌ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం సౌత్‌లోనే కాక నార్త్‌లోను మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో.. దానికి సీక్వల్ గా వస్తున్న పుష్ప 2 కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే శ‌రవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకుంటున్న పుష్ప 2 ఫస్ట్ లుక్, టీజ‌ర్‌, గ్లింప్స్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

Allu Arjun Birthday Special: Pictures That Prove The 'Pushpa' Star's Fashion Game Is On Point

దీంతో పుష్ప 2 మూవీపై మరింత అంచనాలు పెరిగాయి. అసలు విషయానికొస్తే అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ బన్నీ వాస్ మ‌ళ‌యాళ హిట్ మూవీ 2018ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బన్నీ వాస్ అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాల‌పై ఇంట్రస్టింగ్ అప్డేట్స్ చెప్పాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో అల్లు అర్జున్ ఉన్నాడని.. డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ చెప్పాడు బన్నీ వాసు.

ఆ తర్వాత అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తాడ‌ని బ‌న్నీ వాస్ తెలిపాడు. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ డైరెక్ట‌ర్‌. అలాగే షారుఖ్ ఖాన్ జవాన్ లో అల్లు అర్జున్ నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అలాగే బాలీవుడ్ నుంచి ది మోర్ట‌ల్ ఆఫ్ అశ్వద్ధామ సినిమా యూనిట్ అల్లు అర్జున్ సంప్రదించిందని.. వాళ్లకు ఇంకా ఓకే చెప్పలేదని.. అయితే ఆ సినిమాను చేయాలనుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు.

Allu Arjun's New Look From Pushpa 2 Looks Unrecognizable - Bharat Express

దీంతోపాటే అల్లు అర్జున్‌కు బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని తెలిపాడు. అయితే ప్రస్తుతం కళ్ళు చెదిరే ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన బన్నీ.. పుష్ప 2 సినిమాతో తన క్రేజ్ మరింత పెంచుకుంటున్న‌ట్టు ప‌క్కాగా క్లారిటీ వ‌స్తోంది.