52 ఏళ్ల క్రిత‌మే కృష్ణ పాన్ ఇండియా సినిమా… ‘ మోస‌గాళ్ల‌కు మోస‌గాడు ‘ వెన‌క ఇంత హిస్ట‌రీ ఉందా..!

ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ అంతా పాన్ ఇండియా అంటూ పరుగులు తీస్తోంది. రెండు మూడు సినిమాలు అన్ని భాషల్లోనూ హిట్ అవడంతో చివరకు చిన్న చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా సినిమా అంటూ రెండు, మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అసలు కథ వదిలేసి కేవలం పాన్ ఇండియా రిలీజ్ అంటూ హడావుడి చేయటం మన తెలుగు హీరోలకు అలవాటుగా మారింది. అయితే 52 సంవత్సరాల క్రితమే సూపర్ స్టార్ కృష్ణ ఒక అదిరిపోయే పాన్ ఇండియా రేంజ్ సినిమాలో నటించారు.

ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్. ఇంకా చెప్పాలంటే ఆ జానార్లో తెలుగులో వచ్చిన మొట్టమొదటి మూవీ కూడా అదే కావటం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ వెండితెరపై చేసిన ఒక ప్రయోగం మోసగాళ్లకు మోసగాడు. తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేయటంలో ఆయన ఎప్పుడూ ముందు ఉంటారు. ఈ సినిమాలో కౌబాయ్ గా కనిపించి అందరిని మెస్మరైజ్ చేశారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

Mosagallaku Mosagadu' was made at just Rs 7 lakh: Superstar Krishna - Telugu News - IndiaGlitz.com

పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ఈనెల 31వ తేదీన కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్‌ను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేశారు. కృష్ణ పెద్ద కుమార్తె ప‌ద్మావ‌తి ( గ‌ల్లా జ‌య‌దేవ్ భార్య‌) పేరు మీదగా ఆయ‌న ప‌ద్మాల‌య‌ బ్యానర్ ప్రారంభించారు.

Superstar Krishna's pan world cowboy genre film Mosagallaku Mosagadu to re-release on his birthday anniversary | PINKVILLA

ఈ బ్యానర్ లో వచ్చిన తొలి సినిమా అగ్నిపరీక్ష పరాజయం పాలయ్యింది. తన తర్వాత సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలని భావిస్తున్న సమయంలో కౌబాయ్ సినిమా చేయాలన్న ఆలోచన కృష్ణకు వచ్చింది. వెంట‌నే మెకన్నాస్ గోల్డ్, ఫ్యూ డాలర్స్ మోర్, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ వంటి క‌థ‌ల‌ను చూసి ఇన్‌స్పైర్ అయ్యి తెలుగులో కౌబాయ్ సినిమా చేయాల‌ని అనుకున్నారు. ఈ సినిమా క‌థ‌, స్క్రిఫ్ట్ బాధ్య‌తలు ఆరుద్ర‌కు ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆయ‌నే ఈ సినిమాకు మాట‌లు, పాట‌లు కూడా రాశారు. ఆ రోజుల్లో ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యి ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించేసింది.