ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న అనసూయ..మళ్ళీ విజయ్ ని టార్గెట్ చేయడానికి కారణం అదేనా..? ఫింగర్ పెట్టి కెలుకుంటుందా..?

అనసూయ కి నోటి దూల ఎక్కువగా ఉందా ..? అంటే అవునని అంటున్నారు సినీ జనాలు . ఈ మధ్యకాలంలో జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పోస్ట్ చేస్తూ హంగామా చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా జబర్దస్త్ మానేసినప్పటినుంచి కూసింత హద్దుల్లో ఉన్న అనసూయ రీసెంట్ గా మరోసారి రెచ్చిపోయి బోల్డ్ కామెంట్స్ చేసింది . దీనితో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అనసూయ పేరు మారుమ్రోగిపోతుంది . మనకు తెలిసిందే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ముందు నుంచి అనసూయకు వార్ జరుగుతూనే ఉంది .

కోపంతో రగిలిపోతున్న అనసూయ.. ఎందుకో తెలుసా | Anchor Anasuya Angry Over Not Wearing Masks, Coronavirus, Anasuya, Anasuya Live, Masks, Covid Situation - Telugu Anasuya, Anasuya Live, Anchoranasuya, Corona, Coronavirus ...

అర్జున్ రెడ్డి సమయంలో స్టార్ట్ అయిన ఈ వార్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు అనసూయ పరోక్షకంగా కామెంట్ చేస్తూ “కర్మ బూమారాంగ్ అవుతుంది. ప్రతి ఒక్కరు దాన్ని అనుభవించాల్సిందే ” అంటూ చెప్పకు వచ్చింది. ఈ క్రమంలోనే లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతోనే అనసూయ ఇలా కామెంట్ చేసింది అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్ లో ఆడుకున్నారు . ఆంటీ అంటూ పచ్చి బూతు పదాలతో టార్గెట్ చేసే ట్రోల్ చేశారు . తర్వాత ఇన్నాళ్లకు మళ్ళీ ఆ వివాదం సర్దుమనిగింది అనుకుంటే ..మళ్ళీ కొత్త వివాదానికి తెరలేపింది అనసూయ .

Vijay Devarakonda creates a rare record on Instagram - TeluguBulletin.com

రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండను “ది విజయ్ దేవరకొండ” అంటూ మెన్షన్ చేశారు . దీంతో సోషల్ మీడియాలో అనసూయ పరోక్షకంగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. “ఇప్పుడే ఒకటి చూశాను .. దీ నా.. ఏంట్రా బాబు ఈ పైత్యం” అంటూ వ్యంగంగా కామెంట్ చేసింది .ఈ క్రమంలోనే అనసూయ ..విజయ్ దేవరకొండ సినిమా పైనే ఈ పోస్ట్ చేసిందని.. అనసూయ కి నోటి దూల ఎక్కువ అని..? అవసరం లేని పనుల్లో ఎందుకు తల దూర్చాలి ..? అని జనాలు మండిపడుతున్నారు .

Kushi (2023) - IMDb

మరోపక్క విజయ్ దేవరకొండ ఫాన్స్ మళ్లీ అనసూయ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నా అనసూయ ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోవడానికి కారణం పడిపోయిన ఆమె క్రేజ్ గ్రాఫ్ హై చేసుకోవడానికి అంటూ పలువురు వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే అనసూయ తప్పు చేసింది.. విజయ్ దేవరకొండ పై అలా అనాల్సింది కాదు ..ఆ ట్వీట్ చేసి ఉండాల్సింది కాదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!