`యువ‌గ‌ళం`.. టీడీపీకి ఇంత పెద్ద వ‌రం… గ్రాఫ్ ఇంత పెరిగిందా…!

అదేంటి? అనుకుంటున్నారా? అక్క‌డే ఉంది చిత్రం అంతా! కొన్ని కొన్ని విష‌యాల్లో కార్యాకార‌ణ సంబం ధాలు క‌లిసివ‌స్తాయి. టీడీపీ యువ‌నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ ప్ర‌స్తుతం చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర ల‌క్ష్యం వేరే అయినా.. అది సీనియ‌ర్ల‌కు బాగా క‌లిసివ‌స్తోంద‌న్న‌ది.. ప్ర‌స్తుతం టీడీపీలో జ‌రుగు తున్న టాక్. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు సైతం చెప్పుకొచ్చారు. దీంతో సీనియ‌ర్లు ఖుషీగా ఉన్నార‌ని అంటున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం చిత్తూరు, అనంత‌పురం జిల్లాల్లో పూర్తిగా యువ‌గ‌ళం ముగిసింది. అయితే.. స‌హ‌జంగానే ఒక కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు దానిని అలా వ‌దిలేయ‌ర‌నే విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే యువ‌గ‌ళం పాద‌యాత్ర ముగిసిన‌ ఆయా జిల్లాల్లో టీడీపీ గ్రాఫ్ ఎలా ఉంద‌నే విష‌యాన్ని ఆయ‌న ప‌రిశీలించారు. పార్టీ ఇంచార్జ్‌ల నుంచే కాకుండా.. సీబీఎన్ ఆర్మీ నుంచి కూడా ఆయన స‌మాచారం తెప్పించుకున్నారు.

ఇలా వ‌చ్చిన స‌మాచారం మేర‌కు.. సీనియ‌ర్ల గ్రాఫ్ ఆయా జిల్లాల్లో జోరుగా ఉంద‌ని తెలిసింది. అంతేకాదు.. టికెట్ కోస‌మో.. లేక‌.. లోకేష్ క‌నుస‌న్న‌ల్లో ప‌డే దానికో.. కానీ.. సీనియ‌ర్లు కూడా యువ‌గ‌ళం లో పాలు పంచుకున్నారు. ఇదివారి గ్రాఫ్ పెరిగేందుకు దోహ‌ద‌ప‌డింద‌ని చంద్ర‌బాబు గుర్తించారు. ప్ర‌జ‌ల్లోనూ వైసీపీపై వ్య‌తిరేక‌త పెర‌గ‌డానికి యువ‌గ‌ళం దోహ‌ద‌ప‌డితే.. సీనియ‌ర్ల విష‌యంలో వారు పుంజుకునేందుకు సాయం చేసింద‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు.

చిత్తూరులోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సీనియర్లు వెనుక‌బ‌డ్డారు. ఇది గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మికిదారి తీసింది. అయితే.. యువ‌గ‌ళంతో వారంతా మెయిన్ స్ట్రీమ్‌లోకి రావ‌డంతో ప‌రిస్థితి ఇప్పుడు ఆశాజ‌న‌కంగా మారింద‌ని చంద్ర‌బాబుకురిపోర్టులు వ‌చ్చాయి. దీంతో ఇదే ఊపును కొన‌సాగించాల‌ని ఆయ‌న‌సీనియ‌ర్ల‌కు సూచించారు. అంతేకాదు.. ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. యువ‌గ‌ళంలో నారా లోకేష్ క‌లిసిన అన్నివ‌ర్గాల‌కు మ‌రింత చేరువ కావాల‌ని సీనియ‌ర్ల‌కు చంద్ర‌బాబుఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.