బిగ్‌బాస్ నుంచి ఫస్ట్ వీక్‌లో ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రో తెలిసిపోయింది…!

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తాజాగా ప్రారంభమైన విషయం మనకి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టగా.. అందరూ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్స్ విషయానికి వస్తే.. మొత్తం ఎనిమిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

ఇందులో రితిక, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ , దామిని , షకీలా , కిరణ్ రాథోడ్ ఉన్నారు. సెప్టెంబర్ 5 రాత్రి నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలు కాగా.. ఈసారి 10 ఓటులు కాకుండా ఒక కంటిస్టెంట్ కు ఒక్క ఓటు మాత్రమే వేసే విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా రైతు బిడ్డ ప్రశాంత్ భారీ ఓటింగ్ తో నెంబర్ వన్ పొజిషన్లో దూసుకుపోతున్నాడు.

అయితే ఈ వారం ఎలిమినేట్ కాబోయేది కిరణ్ అని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఆమెకు తెలుగు భాషలో పట్టు లేదు. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్లు కూడా ఆమెకు అర్థం కావడం లేదు. అంతే కాదు ఓటింగ్ లో కూడా చాలా వెనకబడి ఉంది. కాబట్టి ఈ వారం కిరణ్ నామినేట్ అవుతుందని సమాచారం.