ఏపీలో ఏ నోట విన్నా అదే అసంతృప్తి. ఎవరిని కదిలించినా కన్నీటి కష్టాలే. ఆదాయం మూరెడు.. ఖర్చులు బారెడు అంటూ ఆవేదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ సర్కారుపై సగటు ప్రజల అసహనానికి ఇంతకన్నా సాక్ష్యం ఉంటుందా..! ఏది ఏమైనా ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో ఇంత దారుణ పరిస్థితిలు లేవని చాలామంది రాజకీయ విశ్లేషకులతో పాటు ఆంధ్రప్రదేశ్లో కనీస పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు చెబుతున్న మాట. ప్రస్తుతం ప్రజల ఆదాయం లో భారీవ్యత్యాసం నెలకొంది.
ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం ప్రభుత్వం అనుసరించిన విధానాలై ఈ దుస్థితికి కారణాలుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలోకి కొంత అమౌంట్ వేస్తున్న ఎంత ?ఖర్చు అవుతుంది అన్నది చూసుకుంటే ప్రభుత్వం వేసిన దానికి డబుల్ ఖర్చులు పెరిగిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెలకు 20000 సంపాదించుకొని ఓ చిరుద్యోగి ప్రతినెల 5000 చిట్టికి కట్టే వాడట. ఇప్పుడు ఆ ఉద్యోగి ఆదాయం 6000 పెరిగి జీతం 26,000 వస్తుంది.
అయితే నెలాఖరికి వచ్చేసరికి కుటుంబం గడిచేందుకే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సదరు మధ్యతరగతి ఉద్యోగి వాపోతున్నాడు. ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయని ఎలా బతకాలని వాపోయాడు. గతంలో రాష్ట్రం నుంచి జిల్లా స్థాయి వరకు ధరల నియంత్రణ కమిటీలు చాలా చురుకైన పాత్ర పోషించేవి. నిత్యవసరాల ధరలో ఏమాత్రం పెరుగుదలకు కనిపించిన వెంటనే చిల్లర వర్తకుల దుకాణాలపై దాడులు చేసేవి. అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేసేవి. ఏసరుకు ధర ఎక్కువగా ఉందో గమనించి వెంటనే రైతు బజార్లు.. రేషన్ డీలర్ల ద్వారా తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేవి.
దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వంలో వైద్య పర్వంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వెంటనే ఆదుకునేవారు ఆ బిల్లులు కూడా వెంటనే మంజూరయ్యేవి అసలు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు కావటం గగనం అయిపోయింది ఇసుక స్టీల్ సిమెంట్ ధరలతో పాటు నిత్యవసరాలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి వైసీపీ సర్కారుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజల ఆదాయాలు దారుణంగా పడిపోయాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనీ రొటేషన్ అనేది బాగా జరిగింది. ప్రజల కొనుగోలు శక్తి కూడా ఎక్కువగా ఉండేది. అప్పుడు ఇంత రేట్లు కూడా ఉండేవి కావు.. అయితే ఇప్పుడు ప్రజల ఆదాయం తగ్గిపోయింది.. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు మనీ రొటేషన్ అన్నదే జరగటం లేదని మధ్య తరగతి వారు వాపోతున్నారు. ఇక రైతులు.. వ్యాపార వర్గాలు కుదేలు అయ్యాయి. పేదలు లేదు మధ్యతరగతి లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ప్రభుత్వంపై తీవ్రమైన అసహనం ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో జగన్ సర్కార్ చిక్కుకుని విలవిల్లాడుతోంది.