టాలీవుడ్లో మలయాళ ముద్దుగుమ్మల హవా ఒక రేంజ్ లో కొనసాగుతుంది. ఇప్పటినుంచే కాదు దాదాపు 10 సంవత్సరాల నుంచి తెలుగు చిత్రసీమను మలయాళం ముద్దుగుమ్మలు ఏలుతున్నారు. సాయి పల్లవి కంటే ముందే నిత్యామీనన్ అందంతోపాటు చక్కటి అభినయంతో తెలుగు తెరపై ఎన్నో హిట్ సినిమాలలో నటించింది. నిత్యామీనన్ చాలా పద్ధతిగా ఉండే పాత్రలోనే నటించేందుకు ఇష్టపడేది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా ఎక్కడా కూడా సాంప్రదాయపద్ధమైన పాత్రలే వేస్తూ గీత దాటలేదు. చక్కటి అందంతో పాటు అభినయం నిత్యామీనన్ సొంతం. నిత్య తెలుగులో మంచి ఫామ్ లో ఉండగానే ఆమెకు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ బాబు బంగారం సినిమాలో జోడిగా నటించే అవకాశం వచ్చింది.
అయితే నిత్య వెంకటేష్ నా పక్కన అంకుల్లా ఉంటారు.. ఆ అంకుల్ పక్కన నేను హీరోయిన్ గా నటించడం ఏంటని చెప్పి పెద్ద షాక్ ఇచ్చిందట. ఆమె అలా చెప్పడంతో వెంకటేష్ సైతం బాగా ఫీలయ్యాడన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించాయి. ఆ తర్వాత ఆ సినిమాలో నయనతారను హీరోయిన్‌గా తీసుకున్నారు.
నిత్యామీనన్ వెంకటేష్ ను అంకుల్ పక్కన నటించను అన్న వార్త అప్పట్లో టాలీవుడ్ లో బాగా స్ప్రెడ్ అయింది. దీంతో కొందరు ఇండస్ట్రీ జనాలు నిత్యకు బాగా తలపొగరు అని విమర్శించారు కూడా..! అయినా కూడా నిత్యామీనన్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఆమె ఈరోజుకి ఎక్కడ పరిధి దాటకుండా తన పాత్ర వరకు న్యాయం చేసుకుంటూ నటిస్తూనే ఉంది.