శ్రీరెడ్డికి మాట ఇచ్చి మోసం చేసిన తేజ‌.. ఇక ఫుట్‌బాల్ ఆడేస్తుందేమో..!

గతంలో శ్రీరెడ్డి తెలుగు ఫిలిం చాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసి ఒక్కసారిగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగు ఆర్టిస్టులకు న్యాయం చేయాలంటూ చిన్నపాటి ఉద్యమం కూడా మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆమెకు అండగా నిలబడ్డ కొద్దిమంది ప్రముఖులలో డైరెక్టర్ తేజ కూడా ఒకరు. తాను తప్పకుండా శ్రీరెడ్డికి తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని తేజ బహిరంగంగా హామీ ఇచ్చారు.

Ahimsa (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

అయితే తేజ ఆ మాట ఇప్పట్లో నిలబెట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. తాజాగా తేజ దగ్గుపాటి వారసుడు అభిరామ్ హీరోగా పరిచయం అయిన అహింస సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాలో ఆమెకు అవకాశం కల్పించలేదు. అయితే శ్రీరెడ్డి అభిరామ్ తనను లైంగికంగా వాడుకుని వదిలేసాడని తీవ్రమైన ఆరోపణలు చేసింది. తేజ ఇలాంటి టైంలో అభిరాం సినిమాలో ఎలాగూ అవకాశం కల్పించలేడు.

ఇప్పుడు మరోసారి కూడా ఆమెకు హ్యాండ్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తేజ తన తర్వాత సినిమాను అభిరాం అన్నయ్య దగ్గుపాటి రానాతో తెరకెక్కిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే అహింస ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తన తర్వాత సినిమా రానాతో ఉండబోతుందని తేజ చెప్పక‌నే చెప్పారు.

Tamil Leaks,Sri Reddy Leaks: பாலியல் புகார் தெரிவித்த ஸ்ரீ ரெட்டிக்கு  சுந்தர்.சி பதிலடி! - sri reddy has accused actor cum director sundar c -  Samayam Tamil

రానా సినిమా అంటే శ్రీరెడ్డికి అందులోను అవకాశం కల్పించలేడు. దగ్గుబాటి ఫ్యామిలీని శ్రీరెడ్డి ఎలా ఆడేసుకుంటుందో తెలిసిందే. శ్రీ రెడ్డి ఇప్పటికే సురేష్ బాబును మామ అంటూ, రానాను బావ అంటూ లెక్కలు ఎన్ని వీడియోలు చేసింది. మ‌రి ఈ లెక్క‌న రానా త‌ర్వాత తేజ మ‌రో సినిమా ఎప్పుడు చేస్తాడో ? శ్రీరెడ్డికి త‌న సినిమాలో ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడో ? కాలమే ఆన్సర్ చేయాలి. అయితే ఈ లోగా తేజ‌ను శ్రీరెడ్డి ఓ ఆటాడేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.