టాలీవుడ్‌లో ప‌గ‌బ‌ట్టి మ‌రీ అత‌డి కెరీర్ నాశ‌నం చేసిన నాగార్జున‌… అడ్ర‌స్ లేకుండా పోయాడు..!

టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌కు ఎవ‌రిపై అయినా కోపం వ‌స్తే వాళ్ల ఆగ్ర‌హానికి, తీవ్ర ఆగ్ర‌హానికి గురి కాక‌త‌ప్ప‌దు. అలాంట‌ప్పుడు బాధితులు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి కెరీర్ రిస్క్‌లో కూడా ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరో నాగార్జున కోపాగ్నికి గురైన ఓ యంగ్ డైరెక్ట‌ర్ అస‌లు ఇండ‌స్ట్రీలో అడ్ర‌స్ లేకుండా పోయాడు.

Watch Bhai Full HD Movie Online on ZEE5

టాలీవుడ్‌లో దర్శకుడిగా ఆహనా పెళ్ళంట, పూలరంగడు వంటి సినిమాలతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన డైరెక్టర్ వీరభద్రం చౌదరి..ఈ రెండు సినిమాల‌తో సూప‌ర్ హిట్లు కొట్టారు. ఆ త‌ర్వాత నాగార్జున హీరోగా భాయ్ సినిమా తెర‌కెక్కించాడు. నాగ్‌, రిచా గంగోపాధ్యాయ జంట‌గా తెర‌కెక్కిన ఈ సినిమాను నాగార్జున స్వ‌యంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు.

అయితే ఈ సినిమా ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యింది. సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యాక నాగ్ చాలాసార్లు మీడియా స‌మావేశాల్లో ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రిపై అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో పాటు ఓ వేస్ట్ డైరెక్ట‌ర్ అంటూ కామెంట్లు చేశాడు. నాగార్జున కెరీర్‌లో ఇంత‌కు మించిన డిజాస్ట‌ర్లు వ‌చ్చాయి. అయితే భాయ్ విష‌యంలో ద‌ర్శ‌కుడు చౌద‌రిని ఎందుకు ? టార్గెట్ చేశాడో తెలియ‌ని ప‌రిస్థితి.

నాగ్ లాంటి హీరో అస‌లు ఈ సినిమా డైరెక్ట‌ర్ వేస్ట్ అన‌డంతో పాటు తెర‌వెన‌క వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రికి అవ‌కాశాలు రాకుండా చేశార‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. నాగ్ ఓపెన్‌గానే అలా టార్గెట్ చేయ‌డంతో ఆ త‌ర్వాత వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రికి ఎవ్వ‌రూ అవ‌కాశాలు ఇవ్వ‌లేదు. చాలా కాలం పాటు టాలీవుడ్ నుంచి అడ్ర‌స్ లేకుండా పోయాడు.

అయితే ఈ సినిమా క‌థ ఒక‌టి అనుకుని.. త‌ర్వాత మార్పులు చేసి తీయ‌డంతో ఎక్క‌డో మిస్ ఫైర్ అయ్యి సినిమా ప్లాప్ అయ్యింద‌ని ద‌ర్శ‌కుడు తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఏదేమైనా భాయ్ సినిమా దెబ్బ‌తో నాగార్జున చేసిన కామెంట్ల‌తో వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి పాతాళంలో ప‌డిపోయాడు.