రెజీనాను కావాలనే టాలీవుడ్‌లో తొక్కేశారా.. ఆమెను టార్గెట్ చేసింది ఎవరు..?

రెజీనా కసాండ్రా ఈమె తెలుగులో శివ మన‌సులో శృతి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. శౌర్య, జో అచ్యుతానంద, కొత్తజంట, సౌఖ్యం, రారా కృష్ణయ్య, నక్షత్రం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఎవరు, పిల్లానువ్వు లేని జీవితం ఇలా చాలా సినిమాలలో నటించి హిట్ కొట్టింది. కానీ రెజీనా మొదటిగా తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన త‌ర్వాత‌ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Regina Cassandra Height, Weight, Age, Biography, Affairs & More » StarsUnfolded

ఆమెకు నటనలో టాలెంట్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్టులో పేరు సంపాదించుకోలేకపోయింది. రెజీనా కేవలం నటిగానే కాకుండా పబ్లిక్ ఈవెంట్స్‌లో కూడా స్టార్ హీరోస్ తో యాంకరింగ్ చేసే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంది. అంత‌ టాలెంట్ ఉన్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఎదగడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. ఈ సంవత్సరం మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది రెజీనా.

Regina Cassandra (aka) Regina photos stills & images

ప్రస్తుతం రెజీనా టాలీవుడ్ లో వరుస‌ సినిమాలు చేయక‌పోవడానికి కొన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె ఒక మెగా హీరోతో రెండుమూడు సినిమాల్లో న‌టించింది. ఆ హీరోతో కొద్ది రోజులు ప్రేమలో ఉందని.. దాని కారణంగానే సినిమా ఇండస్ట్రీలో నుంచి ఆమెను మెల్లమెల్లగా తప్పించారని అప్ప‌ట్లో పుకార్లు షికార్లు చేశాయి.

Regina Cassandra's different necklines | Times of India

ఆ హీరో నుంచి ఆమెను దూరం చేసేందుకే తెర‌వెన‌క కొంద‌రు త‌తంగాలు న‌డిపార‌ని అంటారు. అంతేకాకుండా సరైన పీఆర్ టీం లేకపోవడం కూడా రెజీనాకు సినిమా ఛాన్స్‌లు తగ్గిపోవడానికి ఒక కారణం అంటారు. ఇన్ని భాషల్లో నటిస్తూ సరిగా ఏ భాషలోనూ ఫోకస్ చేయకపోవడం వల్ల ఆమె హీరోయిన్ గా స్టార్డంను సంపాదించుకోలేకపోతోంది.

Tags: film news, filmy updates, hroin, intresting news, latest news, latest viral news, Regina Cassandra, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news