సంయుక్త మీనన్ ఆ స్టార్ హీరోను ప్రేమిస్తోందా… రెండో పెళ్లికి కూడా గ్రీన్‌సిగ్న‌ల్‌…?

సంయుక్త మీనన్ కేరళలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మలయాళంలో సినీ కెరీర్ స్టార్ట్ చేసింది. తక్కువ సమయంలోనే మలయాళీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలో దాదాపు 10కి పైగా సినిమాల్లో న‌టించిన సంయుక్త 2022లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా మల్టీస్టారర్ భీమ్లా నాయక్ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇందులో రానాకు జోడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Mastaaru Mastaaru': First single from Dhanush, Samyuktha Menon's 'SIR' out | Telugu Movie News - Times of India

తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసారా సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత చేసిన సినిమా సార్.. త‌మిళ్ హీరో ధనుష్ .. వెంకి అట్లూరి దర్శకత్వంలో వ‌చిన‌ ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇలా తను నటించిన వరుస సినిమాలు హిట్ కొట్టడంతో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్‌గా మారింది సంయుక్త..

Pin on Samyuktha Menon

ప్రస్తుతం సంయుక్త సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాలో నటించబోతుంది. త్వ‌ర‌లో ఆ సినిమా విడుద‌ల‌కు రెడీగా ఉంది. ఇదిలా ఉంటే ఆమె గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ అమ్మడు ఒక స్టార్ హీరోను ప్రేమిస్తుందట. ఆ హీరోకి ఆల్రెడీ పెళ్లి అయ్యి.. విడాకులు
కూడా వ‌చ్చేశాయ‌ట‌. ఆ హీరో మరెవరో కాదు తను సార్ సినిమాలో కలిసి నటించిన ధనుష్.

Samyuktha Menon at Sir Movie Trailer Launch, HD Photo Gallery

కొద్ది రోజుల క్రితమే ధనుష్ తన సతీమణి ఐశ్వర్య కు విడాకులు ఇచ్చి.. త‌ర్వాత‌ సంయుక్త తో ప్రేమలో పడ్డాడట. సార్ సినిమాలో తొలిసారి సంయుక్త తో స్క్రీన్ షేర్ చేసుకున్న ధనుష్ కు ఆమెతో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందంటూ ప్రచారం జరుగుతుంది. ధనుష్ ను రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సంయుక్త రెడీగా ఉందని న్యూస్ వైరల్ అవుతుంది. మ‌రి ఇందులో నిజానిజాలేంటో వాళ్ల‌కే తెలియాలి.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, samuktha menon, social media, social media post, Star hero, star heroin, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news