శ్రీరెడ్డిని అలా చూపించాల‌ని రెచ్చ‌గొట్టింది ఎవ‌రు ?

వామ్మో శ్రీరెడ్డి పేరు చెపితే టాలీవుడ్‌లో పెద్ద త‌ల‌కాయలే భ‌య‌ప‌డుతున్నాయి. అస‌లు ఆమెతో గ‌తంలో మాట్లాడిన వారు.. ఆమెతో పొర‌పాటుగా ఫొటోలు దిగిన వారు కూడా ఇప్పుడు ఆమె అవి చూపించి ఏం ర‌భ‌స చేస్తుందో . అని భ‌య‌ప‌డుతున్నారు. శ్రీ రెడ్డి బూతులు తిట్టే విష‌యంలోనూ, త‌న‌కు న‌చ్చ‌ని వారిని టార్గెట్ చేసే విష‌యంలోనూ ఏ మాత్రం మోహ‌మాట ప‌డ‌డం లేదు. అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి వాళ్ల అమ్మ‌నే టార్గెట్ చేస్తూ బ‌య‌ట‌కు లాగింది.

ఇక నాగ‌బాబు కూడా శ్రీ రెడ్డి దెబ్బ‌కు జ‌డిసిపోయాడు. న‌ర‌సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు కూడా ఆమె త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు స్పందిస్తూ నీలిచిత్ర తార అని కౌంట‌ర్ ఇచ్చుకోవాల్సిన ప‌రిస్థితి. ఇక టాలీవుడ్‌లోనే పెద్ద ఫ్యామిలీ అయిన ద‌గ్గుబాటి ఫ్యామిలీని కూడా శ్రీ రెడ్డి ఓ ఆటాడేసుకుంది. సురేష్‌బాబు రెండో కుమారుడు అభిరాం త‌న‌కు సినిమా ఛాన్సులు ఇప్పిస్తాన‌ని అన్ని విధాలా వాడుకున్నాడ‌ని ప‌బ్లిక్‌గానే ఆరోప‌ణ‌లు చేసింది.

అక్క‌డితో ఆగ‌కుండా అభిరామ్‌తో లిప్‌కిస్‌లు ఇస్తోన్న ఫొటోలు కూడా బ‌య‌ట పెట్టింది. దీంతో అంద‌రూ స్ట‌న్ అయిపోయారు. శ్రీరెడ్డి మామూలుది కాద‌ని నోటి మీద వేలేసుకున్నారు. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి ఇంటి నుంచి పారిపోయి వ‌చ్చిన‌ప్పుడు ముందుగా సాక్షి ఛానెల్లో యాంక‌ర్‌గా జాయిన్ అయ్యింది. అక్క‌డ ఆడిష‌న్స్‌లో ఆమె సెల‌క్ట్ అయ్యింది.

అయితే ఆ టైంలో ఆమె స్నేహితులు కొంద‌రు.. యాంక‌ర్‌గా చేస్తే ఏం పేరు వ‌స్తుంది ? ఎంత జీతం వ‌స్తుంది… అదే సినిమాల్లో ట్రై చేస్తే నీ ఫిగ‌ర్‌కు త‌గ్గ క్రేజ్‌తో పాటు కావాల్సినంత డ‌బ్బు వ‌స్తుంద‌ని ఆమెను మాట‌ల‌తో బాగా రెచ్చ‌గొట్టేశార‌ట‌. నీ హాట్ టాలెంట్ అక్క‌డ చూపిస్తేనే నీకు లైఫ్ ఉంటుంద‌ని కూడా చెప్పార‌ట‌. అలా వారి మాట‌ల ప్ర‌భావంతోనే శ్రీరెడ్డి సినిమాల్లో ట్రై చేస్తూ ఆఫీసుల చుట్టూ తిర‌గ‌డం.. అలా ఆమెను అవ‌కాశాల పేరుతో కొంద‌రు వాడుకోవ‌డం జ‌రిగింది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, sri reddy, Sri Reddy Updates, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news