ఆ ఒక్క మాటతో అక్కినేని ఫ్యామిలీ పరువు తీసేసిన మంచు లక్ష్మి.. కోపం మొత్తం కక్కేసిందిగా..!?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో డైలాగ్ డెలివరీ చేసి జనాలను మెప్పించే మోహన్ బాబు.. ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రతిష్ఠులు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి ఆయన కొడుకులు వచ్చారు . అయితే ఇప్పటివరకు ఆయన కొడుకులు హీరోగా సెటిల్ కాలేకపోయారు . కానీ ఆయన వారసత్వం గా వచ్చిన కూతురు మాత్రం ఇండస్ట్రీలో కాస్త కూస్తో సెటిల్ అవుతూ.. తండ్రి పేరుని ఇంకా పాపులారిటీ చేస్తుంది.

కాగా కేవలం నటిగానే కాదు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్ గా కూడా లక్ష్మీ మంచు తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . రీసెంట్గా ఆమె నటించిన చిత్రం నక్షత్రం. వంశీకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ని స్వయంగా మంచు లక్ష్మి నిర్మించింది. అంతేకాదు ఆ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో కూడా ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ఈ సినిమా నుండి ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా “తెలుసా తెలుసా ” అనే సాంగ్ ని.. ఈ సినిమా నుండి రిలీజ్ చేశారు మేకర్స్ .

ఈ పాటను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా రిలీజ్ చేయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ఈ క్రమంలోనే మంచు లక్ష్మి సమంత రేంజ్ లో పొగిడేసింది. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కు సంబంధించిన పాట కావడంతోనే మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశామంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు సాంగ్ రిలీజ్ చేసిన సమంతని..ఓ రేంజ్ లో పొగిడేసింది.

” సమంత వ్యక్తిత్వానికి ప్రతిరూపం ..ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలుగా ..తాము ఇలాగే ఉండాలి ..సమంతను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి ..సమంతతో పాటు ఆమె అనుభవించిన కష్టాలు వాటిని ఎదుర్కొన్న తీరు .. తనకు బాగా తెలుసు అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. అంతేకాదు సమంత స్థానంలో ఎవరున్నా సరే నలిగిపోయే వారిని ..కానీ సమంత ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఆ కండిషన్స్ ని ఎదుర్కొని ఇప్పుడు ఇలా మనం ముందు నిలిచిందంటూ .. ఆమెను ఓ రేంజ్ లో పొగిడేసింది.

దీంతో సమంత ఫ్యాన్స్ పరోక్షంగా మంచు లక్ష్మి ..అక్కినేని హీరోస్ ని టార్గెట్ చేసిందన్న కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు . సమంతను పొగడడం వరకు బాగానే ఉంది.. కానీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది.. అని నాగచైతన్య డివోర్స్ విషయాన్ని పరోక్షకంగా ఎత్తడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే కొందరు మంచు లక్ష్మి ..అక్కినేని హీరోలకు ఇచ్చి పడేసింది అంటూ కూడా సామ్ అభిమానులు మంచు లక్ష్మి కమెంట్స్ ని వైరల్ చేస్తున్నారు. లక్ష్మి మాటల బట్టి చూస్తే..అక్కినేని హీరోల పై ఉన్న కోపాని మొత్తం కక్కేసిన్నట్లు ఉంది అంటూ సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నరు..!!

Tags: acttress, film news, filmy updates, intresting news, latest news, latest viral news, manchu lakshmi, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news