ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా మంచు మనోజ్.. భూమా మౌనిక రెడ్డి పేర్లే ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతున్నాయి. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు అటు రాజకీయాల్లోనూ భూమ మౌనికా పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ ఆమె మంచు మోహన్ బాబు రెండో కుమారుడిని రెండో పెళ్లి చేసుకోవడమే కారణం అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరు సంపాదించుకున్న మంచి మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా ఎన్నికై ఇండస్ట్రీలో తనకంటూ ముందుకు వెళ్తున్నాడు . అలాగే నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన మంచు మనోజ్ కొన్ని సినిమాలు చేసే ఆ తర్వాత సుదీర్ఘంగా బ్రేక్ తీసుకొని ..మళ్లీ రిఎంట్రీ కి సిద్ధమవుతున్నాడు .
ఈ క్రమంలోనే 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మంచు మనోజ్.. 2019లో అమ్మాయికి విడాకులు ఇచ్చేసారు. కాగా మొదటి నుంచి భూమా అఖిలప్రియ , భూమా మౌనిక రెడ్డిలతో మంచి ఫ్రెండ్షిప్ ఉన్న మంచు మనోజ్ అక్క మంచు లక్ష్మి కారణంగా మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి కూడా ఫ్రెండ్స్ అయ్యారు . ఈ క్రమంలోని దాదాపు 12 సంవత్సరాల పాటు స్నేహం కంటిన్యూ చేశారు. కాగా ఆ 12 ఏళ్ల స్నేహం గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమగా మారింది. ఈ విషయాన్ని బయట పెట్టడానికి చాలా ట్రై చేసారట. ఆల్రెడీ మౌనిక కి బాబు ఉండడంతో చాలా ఆలోచించారట .
ఫైనల్లీ “శివుని ఆజ్ఞ”తో కలిసాము అంటూ ఈ జంట చెప్పుకొచ్చింది . అయితే మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని భూమా వారసుడిగా రాజకీయాలను కంటిన్యూ చేయబోతున్నాడు అంటూ రాజకీయ వర్గాలల్లో టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే మంచు మనోజ్ పేరు రాజకీయాల్లో మారుమ్రోగిపోతుంది . మరికొందరు మంచు మనోజ్ రాజకీయాలకు వస్తే ఖచ్చితంగా మంచి స్థానాన్ని అందుకోగలడని ..ఆయనకి ఆ మాటకారితనం.. వాక్చాతుర్యం పూర్తిగా ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు .
ఈ క్రమంలోనే అసలు మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకునిందే రాజకీయాల కోసం అనే టాక్ వైరల్ అవుతుంది. మంచు మనోజ్ – భూమా మౌనికని పెళ్లి చేసుకోవడం ద్వారా మనోజ్ కే ప్లస్ అయిందని ..మౌనిక రెడ్డికి మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ రాదని..అసలు వాళ్ళ పెళ్ళి మోహన్ బాబు- విష్ణు కి ఇష్టం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా భూమా ఫ్యామిలీతో కంపేర్ చేస్తే.. మంచు ఫ్యామిలీ స్టేటస్ ఏంటో అందరికి తెలుసు. ఇక ఈ పెళ్ళి ద్వార ఎవరు లాభ పడ్డారో..ఎవరు నష్టపోయారో ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి..! అందరికి తెలిసిందే కదా..!!