ప్రభాస్ – అనుష్క పెళ్లికి అడ్డుపడింది ఎవరు.. ఈ పెళ్లి జరగకూడదని అంత పని చేశారా..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ ఎవ‌రంటే.. ఇద్దరి పేర్లు ఠ‌క్కున‌ చెప్పేస్తారు. అవి యంగ్ రెంబల్ స్టార్ ప్ర‌భాస్, అరుంధతి బ్యూటీ అనుష్క. వీళ్లిద్దరు నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అఫ్ కోర్స్.. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని.. వీలు చూసుకుని పెళ్ళి పీఠలెక్కుతారని టాక్ ఎప్పటి నుంనో నడుస్తుంది. గ‌త నాలుగైదేళ్లుగా ఈ ప్ర‌చారం ముమ్మ‌రంగా జ‌రుగుతోంది.

Anushka Shetty opens up on viral wedding pic with Prabhas from Mirchi -  India Today

ప్రభాస్ పెళ్లి విష‌యం ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందంటూ గతంలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. వీరిద్ద‌రు సీక్రేట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్ళి చేసుకోవాలనుకున్నారని, పెళ్ళి తరువాత ఉండటానికి అమెరికాలో ఇల్లు కూడా కట్టుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.

చాలా ఏళ్లుగా వస్తున్న ఈ వార్తలపై స్టార్ హీరో ప్రభాస్ కాని.. హీరోయిన్ అనుష్క కాని ఖండించలేదు..కనీస స్పందన కూడా ఇవ్వలేదు. దాంతో ఈ విషయంలో ఎంతో కొంత నిజం ఉంద‌ని అనుకుంటున్నారు నెటిజన్లు. అందుకే అప్పుడప్పుడు జనాలు మర్చిపోకుండా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రాజేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రభాస్ అనుష్కల పెళ్లి జరగకూడదు అంటూ గతంలో కృష్ణంరాజు పూజలు చేయించారంటు ఓ వార్త వైరల్ గా మారింది.

Krishnam Raju's Desires that remained as Dreams

ప్రభాస్- అనుష్క పెళ్లి జరగకూడదని కృష్ణంరాజు ఎంతో ట్రై చేశారంటూ గతంలో పలు వార్తలు బయటకు కూడా వచ్చాయి. ప్రధాన కారణం ప్రభాస్ జాతకం, అనుష్క జాతకం కలవలేదట. అంతేకాకుండా అనుష్క జాతకంలో కుజదోషం కూడా ఉందని.. ఆ కారణంగానే ప్రభాస్‌తో అనుష్క పెళ్లి చేయకూడదని గట్టిగా అయిన పట్టుబట్టే వారట.

ప్రభాస్ మాత్రం అనుష్కని తప్పించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోనంటూ కృష్ణంరాజుకి తేగేసి చెప్పేశాడట. అందుకే ప్రభాస్- కృష్ణంరాజు బ్రతికి ఉన్నంతవరకు తన పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన చేయలేదని ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పుడు కృష్ణంరాజు మరణించడంతో మరోసారి ప్రభాస్- అనుష్కల పెళ్లి విషయం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ వస్తుంది. ఈ జంట ఎప్పుడు తన అభిమానులకు శుభవార్త చెప్తుందో చూడాలి.