చిరంజీవి కూడా ఓ సినిమా డైరెక్ట్ చేశార‌ని తెలుసా.. ఆ సినిమా ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు అందరికి హీరోగా,ఓ మంచి డ్యాన్సర్‌గా మాత్రమే తెలుసు. కానీ అయన ఓ సినిమాకి 20 శాతం దర్శకత్వం వహించారు. చాల్లే చెప్పోచ్చారు ఆయన దర్శకత్వం వహించడమేంటి ఇప్పటివరకు మేం వినలే ఎక్కడా ? ఆయన పేరు దర్శకుడిగా చూడలేదని అంటారా ? ఏమైన అనండి కాని ఆయన దర్శకత్వం వహించిన సినిమా అయనే నటించిన సినిమానే కావడం విశేషం. ఇకపోతే చిరంజీవి సినిమాలలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచినా గ్యాంగ్ లీడర్… ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు చిరు స్వయంగా దర్శకత్వం వహించారట.

Gang Leader (1991) (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

 

అవేంటంటే, మురళీమోహన్‌ను హత్య చేసే సన్నివేశం, ఆయన స్నేహితులైన నారయణరావు గ్యాంగ్‌ను వెంటాడి చంపే సీన్లు అవన్నీ చిరు తీశారట. ఈ విషయాన్నీ సీనియర్ నటుడు నారయణరావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ గ్యాంగ్ లీడర్ సినిమాకి విజయ బాపినీడు దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా సగం పూర్తి అయ్యాక సినిమా రషెస్ ని చిరు వేసుకొని చూసారు.

ఆప్పుడు అందులో కొన్ని సీన్లు అనుకున్నంతగా రాలేదని చిరు విజయ బాపినీడుకి చెప్పడంతో విజయ బాపినీడు చిరునవ్వు నవ్వుతూ మీరు కూడా ఓ చేయి వేయండి.. అంటే అప్పుడు గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాను దాదాపు 20 శాతం రీషూట్‌ చేశారట. చిరంజీవి అందుకే తెర మీద పేరు పడని దర్శకుడు అని.. ఆయనలో ఓ గ్రేట్ దర్శకుడయ్యే అవకాశాలున్న గాని అటువైపు వెళ్లకుండా నటుడిగానే తన ప్రస్ధానాన్ని సాగిస్తున్నాడని బాపినీడు తెలిపారు.

Gang Leader (1991) Telugu Songs Lyrics - AtoZ Lyrics - Telugu Songs Lyrics | A to Z Telugu Songs Lyrics in English | Old Telugu Songs Lyrics

ఆ సినిమాలో నారయణరావు ఓ పాత్రను పోషించారు. ఈ సినిమా 1991లో మే 9న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. చిరంజీవికి మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి చాలా దోహదం చేసింది. అంతే కాకుండా ఈ సినిమా 100 రోజుల ఉత్సవం చిరజీవి పుట్టినరోజునాడు జరగడం ఒక ఎత్తు అయితే, తిరుపతి, హైదరాబాదు, ఏలూరు, విజయవాడలలో ఒకేరోజు శతదినోత్సవం వేడుకలు జరపడానికి ప్రత్యేక విమానాన్ని వాడటం మరో విశేషం..