60 ఏళ్ళ వయస్సులో రెండో పెళ్లి చేసుకోన్న‌ టాలీవుడ్ విలన్… అంత చిన్న అమ్మాయితో కొత్త కాపురం..!

టాలీవుడ్ లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్ధి. పోకిరి సినిమాలో ఇలియానాని వేధించే శాడిస్ట్ పోలీస్ ఆఫీసర్ అంటే అందరికి వెంటనే గుర్తుకొస్తారు. తెలుగులో విలన్ గా విభిన్నమైన పాత్రలలో నటించిన ఆశిష్ విద్యార్ధి భారతీయ భాషలన్నింటిలో సినిమాలు చేశారు.

Ashish Vidyarthi Did Second Marriage At Age Of 60 See Photos | Ashish Vidyarthi  Marriage: 60 साल की उम्र में फिर से दूल्हा बने आशीष विद्यार्थी, जानें किससे  की शादी

సినిమాలు ప్రస్తుతం తగ్గిపోవడంతో సొంతంగా ఒక యుట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని వ్లోగ్స్ చేస్తూ దేశం మొత్తం తిరిగేస్తున్నారు. రకరకాల వీడియోలు చేస్తూ మిలియన్ల‌లో ఫాలోవర్స్ పెంచుకున్నారు. ఆశిష్ విద్యార్ధి యుట్యూబ్ ఛానల్ కి మంచి డిమాండ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా 60 ఏళ్ళ వయస్సులో ఈ సీనియర్ స్టార్ యాక్టర్ పెళ్లి చేసుకున్నాడు.

అరవై ఏళ్ళ ఆశిష్ విద్యార్ధి నిన్న బెంగాలి అమ్మాయి రూపాలి బారువాని వివాహం చేసుకున్నాడు. ఆమె వయసు 33 సంవత్సరాలు. మొదటి భార్య రజోషి బారువా. నిన్నటి తరం నటి శకుంతల కూతురు. రూపాలి కోల్‌కొతాలో పెద్ద ఫ్యాషన్ స్టోర్ నడుపుతూ స్వంతంగా వ్యాపారంలో ఎదుగుతోంది. ఈవిడ స్వస్థలం గౌహతి. కొన్నేళ్ల నుంచి సాగిన పరిచయం మూడు ముళ్ల దాకా తెచ్చింది.

Actor Ashish Vidyarthi Ne 60 Saal Ki Umar Me Ki Dusri Shaadi Photo Hua  Viral - GalliNews India

అతికొద్ది మంది బంధు మిత్రుల మధ్య ఈ తతంగాన్ని నడిపించారు. పెళ్లి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఏజ్ ఎంతైనా సరే సినీ తారలు ఇలా మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు వాటి తాలూకు వార్తలు పట్ల జనానికి మంచి ఆసక్తి ఉంటుంది. ఆశిష్ విద్యార్ధి మాత్రం మహా ఆనందంగా ఉన్నాడు.

చాలా థ్రిల్లింగ్ గా ఉందని కొత్త జీవిత భాగస్వామితో లైఫ్ ని రంగులమయం చేసుకుంటానని చెబుతున్నారు. వీళ్ళ ప్రేమకథ చాలా పెద్దదేనట. సమయం వచ్చినప్పుడు డీటెయిల్డ్ గా చెబుతానని ఆశిష్ అంటున్నారు. మొత్తానికి 60 ఏళ్ళ వయస్సులో తనకంటే చాలా తక్కువ వయస్సున మహిళని వివాహం చేసుకోవడంతో వీరి పెళ్లి హాట్ టాపిక్ గా మారింది.