Manchu Vishnu : మంచు విష్ణు ట్రోల్స్ వెనక ఉన్న ఆ స్టార్ హీరో ఎవరు..?

Manchu Vishnu :మంచు ఫ్యామిలీ హీరో మంచు విష్ణు ఎట్టకేలకు తన మీద వస్తున్న ట్రోల్స్ మీద స్పందించారు. మా ఎలక్షన్స్ టైం లోనే తన మీద వస్తున్న ట్రోల్స్ మీద స్పందించాలని అడిగారు కానీ అప్పుడు ఎలక్షన్ టైం అని మాట్లాడలేదు. కానీ ఇప్పుడు దాని గురించి స్పందించారు. మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా పోస్ట్ పోన్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాడు. దసరాకి పోటీగా రావాలని ముందు అనుకున్నా సరే ఆల్రెడీ రెండు పెద్ద సినిమాలు వస్తున్న ఈ టైం లో రిస్క్ ఎందుకని సినిమా వాయిదా వేసుకున్నారు మంచు విష్ణు.

ఇక ఈ క్రమంలో తన మీద ట్రోల్స్ చేస్తున్న వారి మీద సైబర్ క్రైం వారి దృష్టికి తీసుకెళ్లామని అయితే వారు చెప్పిన దాన్ని బట్టి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ.. ఓ హీరో ఆఫీస్ ల ఐపీ అడ్రెస్ ల నుంచి ఈ ట్రోల్స్ వస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు మంచు విష్ణు.

సూర్య డైరక్షన్ లో తెరకెక్కిన జిన్నా సినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈసారి మంచు విష్ణు జిన్నా సినిమాతో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు. చాలారోజుల తర్వాత మంచు విష్ణు చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్.. సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటించారు. మంచు విష్ణు ఈ సినిమాతో హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.

Tags: Ginna Movie, Kona Venkat, manchu vishnu, Payal Rajput, Vishnu Ginna, Vishnu Manchu