Chandu Mondeti : కార్తికేయ 2 తో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ చందు మొండేటి తన నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియా ప్లానింగ్ లో ఉన్నాడని టాక్. కార్తికేయ 2 తో అతనికి మంచి మైలేజ్ ఏర్పడింది. అందుకే అతనికి క్రేజీ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ కూడా చందు మొండేటికి ఆఫర్ ఇచ్చినట్టు టాక్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చందు మొండేటి హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మరి ఈ పాన్ ఇండియా సినిమాలో హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. కార్తికేయ 2 తను డీల్ చేసిన విధానం అదిరిపోయింది. అందుకే తెలుగు ఆడియన్స్ తో పాటుగా హిందీ ప్రేక్షకులకు ఆ సినిమా బాగా నచ్చేసింది. అందుకే చందుతో మరో డిఫరెంట్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమాకు అతను అడిగిన బడ్జెట్ ని ఇస్తున్నారట.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. చందు మొండేటి నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు.. అతని లిస్ట్ లో ఉన్న హీరోలు ఎవరు అన్నది తెలియాలంటే మరికొద్ది రోజుల్లో తెల్సుతుంది. అయితే గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి ఖచ్చితంగా మెగా హీరోతోనే చందు సినిమా ఉంటుందని అంటున్నారు. మరి చందు ఈసారి ఎలాంటి కథతో వస్తారో చూడాలి.