Prabhas : ప్రభాస్ దూరం పెట్టలేదు.. అలా మారడం అతనివల్ల కాదు..!

Prabhas Srinu Hot Comments on Prabhas

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనని ఏమాత్రం దూరం పెట్టలేదని అంటున్నాడు కమెడియన్ ప్రభాస్ శ్రీను. ప్రభాస్ ఫ్రెండ్ గా.. అతని రైట్ హ్యాండ్ గా ఉంటూ వస్తున్న ప్రభాస్ శ్రీను.. రీసెంట్ ఇంటర్వ్యూలో అతనపై ప్రభాస్ పై వస్తున్న వార్తల గురించి స్పందించాడు. ప్రభాస్ తనని దూరం పెట్టాడని.. ప్రభాస్ తనతో టచ్ లో లేడని ఏవేవో వార్తలు రాస్తున్నారు. కానీ ప్రభాస్ తనని ఎప్పుడూ దూరం పెట్టలేదని ఇప్పటికీ తాను ప్రభాస్ దగ్గరే ఉంటున్నానని.. అయితే ఈమధ్య సినిమాల్లో కనిపించకపోయే సరికి ఇలాంటి వార్తలు వస్తున్నాయని అన్నారు.

ప్రభాస్ తనకు సత్యానంద్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ తీసుకుంటున్న టైం లో నుంచి పరిచయం ఉందని.. ఆ టైం లోనే ప్రభాస్ గొప్ప స్టార్ అవుతాడని తాను చెప్పానని. ప్రభాస్ తన ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడని.. తాను స్టార్ ఆవకముందు ఎలా ఉన్నాడో.. స్టార్ అయిన తర్వాత కూడా ప్రభాస్ అలానే ఉన్నాడని అన్నారు ప్రభాస్ శ్రీను.

ప్రభాస్ అసిస్టెంట్ గా శ్రీను తన డేట్స్ చూస్తుంటాడు. అంతేకాదు ప్రభాస్ అన్ని విషయాల్లో కూడా ప్రభాస్ శ్రీను ఉంటాడు. ఈమధ్య కృష్ణం రాజు మరణించిన టైం లో కూడా ప్రభాస్ పక్కనే శ్రీను కూడా ఉన్నారు. ప్రభాస్ కి ఎప్పుడూ తోడుంటూ అతనికి సపోర్ట్ ఇస్తున్న వారిలో ప్రభాస్ శ్రీను ఒకరు.

Tags: Prabhas, Prabhas News, Prabhas Srinu, Prabhas Updates, Rebal Star, Tollywood