ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు.. తెలుగులోనే అత్యధిక సినిమాల నిర్మాతగా గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డు సాధించిన దివంగత డి. రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలు అడుగుపెట్టిన వెంకటేష్. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా సరే తన స్వయంకృషితోనే స్టార్ హీరోగా ఎదిగాడు. కెరీర్ మొదట్లో కాస్త వెనకబడిన ఆ తర్వాత వరస విజయాలను అందుకుంటూ విక్టరీనే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు.
ఫారెన్ లో ఎంబీఏ పూర్తి చేసిన వెంకటేష్ నిజానికి హీరో అవ్వాలని ఎప్పుడు అనుకోలేదట. తన తండ్రి తన అన్న సురేష్ బాబు బాటలోనే నిర్మాతగా అడుగు పెట్టాలని ఎన్నో కలలు కన్నారట. అయితే వెంకటేష్ కు సూపర్ స్టార్ కృష్ణ ఆ టైంలో నచ్చచెప్పి ఎంతో అందంగా ఉన్నావు నిర్మాతగా కంటే హీరో గాని నీకు చిత్ర పరిశ్రమలో ఎక్కువ గ్రోత్ ఉంటుందని కృష్ణ చెప్పారట. ఆయన సూచనలు మేరకు వెంకటేష్ మనసు మార్చుకుని కలియుగ పాండవులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఖుష్బూ హీరోయిన్గా నటించింది. 1986లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత నుంచి వెంకటేష్ వెనక్కి తగ్గలేదు మూడున్నర దశాబ్దాల ప్రయాణంలో వెంకటేష్ ఎన్నో విభిన్నమైన పాత్రలు సినిమాలు ఎన్నో అవార్డులు అందుకున్నారు. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగులోనే అత్యధిక విజయాలను ఖాతాలో వేసుకున్న హీరోగా రికార్డు సృష్టించారు. అలాగే అత్యధిక రీమేక్లు, మల్టీ స్టార్ సినిమాలు చేసిన హీరోగా కూడా వెంకటేష్ రికార్డులు సృష్టించాడు.
వెంకటేష్ ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు ఇటు మాస్ ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యాడు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఇప్పటి తరం హీరోలకి కూడా గట్టి పోటీ చేస్తున్నాడు. ప్రస్తుతం `సైంధవ్` సినిమాతో బిజీగా ఉన్నాడు. కాగా వెంకటేష్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఈయన ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధంలేని నీరజను పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయి పేరు అర్జున్ రామంత్. అమ్మాయిల పేరు ఆశ్రిత, హయవాహిని, భావన. వీరిలో ఆశ్రిత తప్పితే.. మిగిలిన వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.