శనిలా దాపరించిన సుస్మిత.. ఇక చిరంజీవి పని అంతేనా..!

మెగాస్టార్ పెద్దకూతురు సుస్మిత కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ప్రస్తుతం కాస్ట్యూమ్ డిజైనర్ గా సినీ కెరీర్‌ను ప్రారంభించింది సైరా సినిమా దగ్గర నుంచి చిరంజీవికి సుస్మితనే కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తుంది. అదేవిధంగా మరోవైపు సొంతంగా గోల్డ్ బాగ్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది. ఇక తన బ్యానర్లో సేనపతి, శ్రీదేవి శోభన్ బాబు వంటి సినిమాల‌ను కూడా నిర్మించింది.

ఇప్పుడు తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం అందుకుంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై భారీగా ట్రోల్స్ రివ్యూలు వీడియోలు వస్తున్నాయి. అదేవిధంగా దర్శకుడు మెహర్ రమేష్ పై చిరు అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమాకు సంబంధించిన చిరంజీవి కాస్ట్యూమ్ డిజైనర్ గా సుస్మిత వ్యవహరించిన విషయం తెలిసిందే. కానీ చిరు న‌టించిన‌ సైరా సినిమాకు ముందు చిరంజీవి వస్త్రధారణ ఎంతో స్టైలిష్ గా ఉండేదని.. ఆ సినిమా తర్వాత నుంచి చిరు కాస్ట్యుమ్స్ అంత‌ల‌ మెప్పించేలా లేవని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.

ఇదే సమయంలో రంగస్థలం సినిమాలో తమ్ముడు రామ్ చరణ్ కి మాత్రం సూపర్ కాస్ట్యూమ్స్ అందించిందని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి పాట‌ల‌కు ఆమె ఎంపిక చేస్తున్న డ్రస్సులు అంతగా మెపించేల‌ లేవని.. 70 ఏళ్ల వయసులో కూడా జైలర్‌లో రజనీకాంత్ కాస్టింగ్ ఎంతో స్టైలిష్ గా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. సైరా, వాల్తేరు వీరయ్య, సినిమాల‌కు ఇచ్చిన కాస్ట్యూమ్స్ పై పెద్దగా విమర్శలు రాలేదు కానీ ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఆయన లుక్ పై కూడా విమర్శలు వస్తున్నాయి.

భోళాశంకర్ లో ఆయన ఉపయోగించిన కాస్ట్యూమ్స్ కూడా పాత మోడల్ గా ఉన్నాయని ఫ్యాన్స్ సోషల్ మీడియా కామెంట్‌లు పెడుతున్నారు. దీంతో చిరంజీవి రాబోయే చిత్రాల నుంచి సుస్మితను తొలగించాలని వారు తెలుపుతున్నారు. ఆమెకు బదులుగా ప్రఖ్యాత స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్‌ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిరు తదుపరి చిత్రాన్ని సుస్మిత హోమ్ బ్యానర్ నిర్మిస్తుంది. కాబట్టి.. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఫ్యాన్స్‌ ఆలోచిస్తున్నారు