వైసీపీలో ఓడిపోయే ఫ‌స్ట్ సెన్షేష‌న‌ల్ లీడ‌ర్ ఎవ‌రంటే…. ఫ‌స్ట్ వీకెట్ క్లీన్‌బౌల్డ్‌…!

ఏపీలో గత సాధారణ ఎన్నికలలో అధికార వైసిపి ఏకంగా 151 స్థానాలు గెలుచుకుని తిరుగులేని బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అసలు వైసీపీ సాధించిన ఈ అప్రతహత విజయంతో దేశం మొత్తం జగన్ పాలన వైపు ఎంతో ఆసక్తితో చూసింది. నాలుగేళ్ల పాలనలో జగన్ పదేపదే సంక్షేమం అని చెప్పుకుంటున్నా రాష్ట్ర ప్రజలకు కాదు.. చివరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్యకర్తలకు ఏమాత్రం సంతృప్తి లేదని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ రాజధాని ఎక్కడ ఉందో ? ఎవరికీ తెలియని పరిస్థితి. అభివృద్ధి అన్నది ఎక్కడ కానా రావటం లేదు.

ముఖ్యంగా టిడిపి పాలనలో అమరావతిలో ఎంతో అభివృద్ధి జరిగింది. జగన్ ఈ నాలుగేళ్లలో అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యేది. దేశపటంలో అమరావతి మంచి రాజధానిగా ఉండేది. అసలు అమరావతిని రాజధాని చేయడం జగన్‌కు ఎంత ? మాత్రం ఇష్టం లేదు. ఎప్పుడు అయితే రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారో అప్పుడే కృష్ణ, గుంటూరు జిల్లాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీని చూసి భయపడి మాత్రమే ఓట్లు వేసిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది.

గత పాలనలో చంద్రబాబు అమరావతిని ఎంత అభివృద్ధి చేసినా అమరావతి విస్తరించి ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో టిడిపిని చిత్తుగా ఓడించారు. మంగళగిరిలో మంత్రిగా ఉండి పోటీ చేసిన చంద్రబాబు తనయుడు లోకేష్ అయితే ఐదువేల ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. లోకేష్ ను ఓడిస్తే ఆర్కే ను మంత్రిని చేసి తన పక్కన కూర్చోబెట్టుకుంటానని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని జగన్ ఇప్పటివరకు నిలబెట్టుకోలేదు సరి కదా ఎన్నికల ముందు కూడా ఆర్కేను మంత్రిని చేస్తారన్న గ్యారెంటీ లేదు.

ఇక రాజధాని మార్పు ప్రభావం కూడా మంగళగిరి నియోజకవర్గం పై బాగా ఉంది. రాజధాని వికేంద్రీకరణతో మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సాధారణ ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. దీనికి తోడు లోకేష్ నాలుగేళ్లలో ఎప్పుడూ మంగళగిరిలోనే అంటిపెట్టుకొని ఉన్నారు. తాను మళ్ళీ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెబుతూ వచ్చారు. ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్న ఆదుకున్నారు… ఇంకా చెప్పాలంటే త‌న సొంత నిధుల‌తో లోకేష్ ఇక్క‌డ అభివృద్ధి చేశారు. ఎమ్మెల్యే కంటే కూడా లోకేషే ఎక్కువుగా ఇక్క‌డ స‌మ‌స్య‌ల‌పై స్పందించి ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిపోయింది.లోకేష్ మంగళగిరి నుంచి ఘనవిజయం సాధిస్తారనటంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఇక్కడ కూడా లోకేష్ కు చిన్న మైనస్ ఉంది నియోజకవర్గంలో మంగళగిరి మున్సిపాలిటీ, మంగళగిరి రూరల్ దుగ్గిరాల మండలాల్లో తెలుగుదేశం చాలా బలంగా ఉంది. తాడేపల్లి మున్సిపాలిటీ తాడేపల్లి మండల్ లో ఇంకా వైసీపీకి కాస్త ఎడ్జ్‌ కనపడుతుంది. దీనిని సరి చేసుకుంటే లోకేష్ రికార్డు మెజార్టీతో మంగళగిరి నుంచి గెలిచి గర్వంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టవచ్చు. ఏదేమైనా లోకేష్ ను ఓడించి సంచలనం క్రియేట్ చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్లీ అక్కడి నుంచి పోటీ చేస్తే వైసీపీలో పడే ఫస్ట్ వికెట్ అని చెప్పాలి.

Tags: ap politics, politics, politions, social media, trending news, viral news, viral news social media, ycp, ysrcp social media