అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగుతోపాటు తమిళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నటీమణి అమల. కన్నడ, మలయాళ, తమిళ సినిమాలలో కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తన అద్భుతమైన నటనతో అమల రెండు ఫిల్మ్ పేరు అవార్డులు కూడా గెలుచుకుంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించారు.
అమల తెలుగులో నాగార్జునతో మూడు సినిమాలలో నటించారు. నిర్ణయం, శివ రెండు సూపర్ హిట్ సినిమాలు. ఈ రెండు సినిమాలలో కలిసి నటిస్తున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొద్ది రోజుల తర్వాత వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహం అనంతరం అమల తన మకాం హైదరాబాద్‌కు మార్చేశారు. నాగార్జునను పెళ్లి చేసుకున్నాక అమల సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.
తర్వాత చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్నారు. ఈ దంపతులకు అక్కినేని అఖిల్ జన్మించాడు. అఖిల్ చిన్న వయసులోనే సిసింద్రీ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2015 లో వచ్చిన అఖిల్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. అమల నాగార్జుకు ఎలా ? పరిచయం అయ్యారు అన్నదానిపై ఆసక్తికరమైన విషయం ఉంది. అమల ఐర్లాండ్ దేశ మూలాలు ఉన్న మహిళ.
ఆమె తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. అమల తండ్రి బెంగాల్ నేవీ ఆఫీసర్ ముఖర్జీ. అమల తల్లి హాస్పిటల్లో నర్సుగా ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయంతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. అమల తల్లిదండ్రులు వైజాగ్, చెన్నై పట్టణాల్లో ఉద్యోగ నిమిత్తం చాలాకాలం జీవించారు. ఆ దంపతుల బిడ్డగా అమల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా రాణించారు. ఈ క్రమంలోనే నాగార్జునతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది.