శ‌ర్వానంద్ భార్య‌ ర‌క్షితా రెడ్డి అన్ని కోట్ల క‌ట్నం తెచ్చిందా… మ‌నోడి రేంజ్‌కు త‌క్కువేగా…!

టాలీవుడ్‌లో కుర్ర హీరోల‌లో మంచి క్రేజ్ ఉన్న వారిలో శ‌ర్వానంద్ ఒక‌రు. ఇటు యూత్‌తో పాటు అటు ఫ్యామిలీ స‌బ్జెక్ట్ క‌థాంశాల‌తో మంచి మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక శ‌ర్వానంద్ ఎట్ట‌కేల‌కు బ్యాచిల‌ర్ లైఫ్ నుంచి విముక్తి పొంది ఎట్ట‌కేల‌కు ఓ ఇంటివాడ‌య్యాడు. తాను ప్రేమించిన ర‌క్షితారెడ్డితో శ‌ర్వానంద్ పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జైపూర్ ప్యాలెస్‌లో జ‌రిగింది.

Sharwanand-Rakshita Reddy gets married

రెండు రోజుల పాటు జ‌రిగిన ఈ పెళ్లి వేడుక‌ల‌కు తెలుగు సెల‌బ్రిటీలు ఎంతోమంది హాజ‌ర‌య్యారు. ఇక శ‌ర్వానంద్‌కు త‌న అత్తింటి వారి నుంచి అందిన క‌ట్న‌, కానుక‌లు ఎంత అన్న‌ది కూడా ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల ద్వారా బ‌య‌ట‌కు లీక్ అయ్యింది. శ‌ర్వా భార్య ర‌క్షితారెడ్డికి రు. 100 కోట్ల స్థిర‌చ‌రాస్తులు క‌ట్నంగా వ‌చ్చాయ‌ని తెలుస్తోంది.

హైద‌రాబాద్‌లో ఉన్న ప్లాట్లు, ఇండిపెండెంట్ హౌస్‌తో పాటు కొంత న‌గ‌దు కూడా క‌ట్నంగా ఇచ్చార‌ట‌. అయితే మేజ‌ర్ క‌ట్నం మాత్రం స్థిరాస్తుల రూపంలోనే వ‌చ్చిన‌ట్టు చెపుతున్నారు. అయితే శ‌ర్వాలాంటి స్టార్ హీరో రేంజ్‌కు రు. 100 కోట్ల క‌ట్నం అంటే కాస్త త‌క్కువే అన్న చ‌ర్చ కూడా ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది. ఇక రక్షితారెడ్డికి కూడా బ‌ల‌మైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది.

Sharwanand Ties The Knot With Rakshita Reddy In Jaipur, SEE FIRST PICS From  The Destination Wedding HERE! - Filmibeat

ఆమె తాత మాజీ మంత్రి టిడిపి నాయకుడు, దివంగ‌త‌ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. ఆయ‌న చిత్తూరు జిల్లాలోని శ్రీకాళ‌హ‌స్తి నుంచి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచి గ‌త చంద్ర‌బాబు కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. ఇక ఆమె నాన్న హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి. ఇక ర‌క్షితా రెడ్డి పేరు మీద కూడా మంచిగానే ఆస్తులు ఉన్నాయంటున్నారు. ఏదేమైనా మొత్తానికి శ‌ర్వా బ‌ల‌మైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇంటి అల్లుడు అయ్యాడు.