టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న శర్వానంద్ ..ఎట్టకేలకు ఓ ఇంటి వాడు అయిపోయాడు . తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి గారి అమ్మాయి రక్షిత రెడ్డిని ఘనంగా పెళ్లి చేసుకున్నారు . ఈ ఏడాది మొదట్లో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్ జూన్ మూడవ తేదీ రాత్రి 11 గంటల మూడు నిమిషాలకు లీలా మహాల్ ప్యాలెస్ లో రక్షిత రెడ్డి మెడలో తాళి కట్టి అఫీషియల్గా తన భార్యను చేసుకున్నారు.
వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి . కాగా శర్వానంద్ సినిమాల విషయంలో ఎంత కమిట్మెంట్ గా ఉంటారు మనందరికీ బాగా తెలిసింది. అయితే శర్వానంద్ 24 గంటల్లోనే భారీ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ అవుతుంది . శర్వానంద్ సుదీర్ఘంగా సినిమాలకు బ్రేక్ వేయాలని నిర్ణయించుకున్నారట . రెండు నెలల పాటు పూర్తిగా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి ..ఫుల్గా తన వైఫ్ తో ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యారట.
ఫారిన్ కంట్రీస్ కి హనీమూన్ కి వెళ్లాలని ఫిక్స్ అయిపోయారట . ఈ క్రమంలోని ఫస్ట్ మాల్దీవ్స్ కి హనీ మూన్ వెళ్ళనున్న ఈ జంట.. పక్క ప్లాన్స్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది . ఆ తర్వాత వీళ్ళు ఒక నెలపాటు ఫారిన్ కంట్రీస్ కి తిరగబోతున్నారట . ఈ క్రమంలోని పెళ్లి ముందు వరకు సినిమాలంటే ప్రాణం అన్న శర్వానంద్ ..పెళ్లి తర్వాత భార్యనే ప్రాణంగా సినిమాలను దూరం పెట్టాడు అంటూ ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. దీంతో సోషల్ మీడియాలో శర్వానంద్ పెళ్లి ఫొటోస్ మరోసారి వైరల్ అవుతుంది..!!