ఇండియాలో నెంబ‌ర్ 1 హీరోయిన్ ఎవ‌రో తేలిపోయింది…!

ప్రతి సంవత్సరం హీరోయిన్స్ పాపులారిటీని బట్టి వారి ర్యాంకులను నిర్ణయించే ఓర్మిక్స్ సంస్థ గురించి మనకు తెలుసు. ఈసారి ఈ సంస్థ టాప్ టెన్ హీరోయిన్స్ లిస్టును రిలీజ్ చేసింది. వారిలో మొదటి స్థానం ఆలియా భ‌ట్ సాధించింది. రెండో స్థానంలొ హీరోయిన్ దీపిక పదుకొనే నిలిచింది. మూడో స్థానాన్ని కియారా అద్వానీ కైవసం చేసుకుంది. కియారా గత ఏడాదితో పోలిస్తే ఈ యేడాది కాస్త మెరుగైందనే చెప్పాలి కియారా. సీనియర్స్ అయినా కత్రినా కైఫ్, శ్రద్ధ కపూర్ లను అధిగమించి మూడో స్థానానికి చేరుకుంది. కానీ ఆలియా భట్ పొజిషన్‌ను అందుకోలేక‌పోయింది.

Shraddha Kapoor Photos [HD]: Latest Images, Pictures, Stills of Shraddha  Kapoor - FilmiBeat

2022లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటించింది ఆలియా భట్. ఆమె ఈ పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రజాభిమానానికి ఎంతో దగ్గర అయింది. ఆర్ ఆర్ ఆర్ , గంగుభాయి కథియావాడి, బ్రహ్మాస్త్ర లాంటి చిత్రాలలో ఆమె కథానాయకగా నటించింది. ఈ క్ర‌మంలోనే అత్య‌ధిక ప్ర‌జాదార‌ణ‌తో ఓర్మిక్స్ జాబితాలో నెంబర్ వన్ గా నిలిచింది ఆలియా భట్. రెండో స్థానానిక దీపికా పడుకొనే దక్కించుకుంది.

Kareena Kapoor says getting married was 'the biggest taboo' for female  actors, reflects on how times have changed | Entertainment News,The Indian  Express

పఠాన్ సినిమాతో బాగా పాపులారిటీ పొందింది. 2023 ఆస్కార్ వేదిక పైన దీపిక పదుకొనే సందడి చేసింది.
కియారా అద్వానీ టాలీవుడ్ బాలీవుడ్ లో వరుస సినిమాల‌తో.. తన అందం అభినయంతో ప్రజాదారణను దక్కించుకొని తన స్థానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది. కత్రినా కైఫ్ నాలుగో స్థానాన్ని ఆక్రమించగా.. ప్రభాస్ స‌రసన ఆదిపురుష్‌లో నటిస్తున్న కృతీసనన్ 5వ స్థానంలో ఉంది. కృతి శ్రద్ధ కపూర్ ను సైతం వెనక్కి నెట్టి 5 వ స్థానాన్ని అందుకుంది.

Kriti Sanon's IIFA 2018 gown is way too similar to Aishwarya's Cannes look

 

తూ ఝాతి మైన్ మక్కర్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మళ్లీ శ్రద్ధా కపూర్ ఫామ్ లోకి వచ్చింది. అత్యంత ప్రజాదారణ‌లో ఆరో స్థానంలో నిలిచింది. ఇటీవల విక్కిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కత్రినా ప్రజల్లో తన ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ క్ర‌మంలోనే క‌త్రినా కరీనాకపూర్ ఖాన్, ఐశ్వర్య రాయ్‌ బ‌చ‌న్ ను దాటేసింది. కరీనాకపూర్ ఏడవ స్థానంలో నిలిచారు. కరీనాకపూర్ పర్సనల్ గాను, ప్రొఫెషనల్ గానూ తన లైఫ్ చక్కగా బ్యాలెన్స్ చేస్తూ తల్లిగా వ్యవహరిస్తూ కూడా 7 వ స్థానాన్ని దక్కించుకుంది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news