హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‌గా నటించిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున‌ ఇప్ప‌టికి స్టార్ హీరోగా కొనసాగుతునే ఉన్నాడు. నాగార్జున హీరోగా నటించి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో హలో బ్రదర్ సినిమా ఒకటి. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ పోషించాడు.

Hello Brother Telugu Full Movie | Nagarjuna | Ramya Krishna | Brahmanandam  | Ali | Telugu Filmnagar - YouTube

రాజ్ కోటి సంగీతం అందించిన ఈ సినిమా 1994వ సంవత్సరం ఏప్రిల్ 28 విడుదలై.. ఆ ఏడాది విడుదలైన అన్ని సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ వ‌చ్చిన సినిమాలో ఒకటిగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాను హాంకాంగ్ యాక్షన్ కామెడీ రీమేక్ గా రూపొందించారు. హలో బ్రదర్ సినిమా రూపొందించే మొదట్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఫోన్ చేసి మరి ఈ సినిమా చేయవద్దని చెప్పారట. వారిలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు.

Amazon.com: Hello Brother : Akkineni Nagarjuna, Ramya Krishnan, Soundarya,  Napoleon, Sri Hari, Kota Srinivasa Rao, Brahmanandam, Sarath Babu, Ali,  E.V.V.Satyanarayana & Ramani, E.V.V.Satyanarayana, K.L.Narayana: Prime Video

నాగార్జున మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈవివి సత్యనారాయణ పై ఉన్న నమ్మకంతో ఆ సినిమాను ఓకే చేశారట. అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. ఇంతకీ ఈ సినిమాల్లో నాగార్జున డ్యూయల్ రోల్ చేయగా నాగార్జునకు డూప్ గా టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరో నటించారు. ఇంతకీ ఎవరు స్టార్ హీరో ఎవ‌రో కాదు శ్రీకాంత్.

Nagarjuna Akkineni on Twitter: "@actorsrikanth Thank you dear Srikanth…  Thinking of all the memories I had with you😊👍" / Twitter

 

శ్రీకాంత్ ఈ సినిమాలో నాగార్జునకు డూప్ గా నటించారట. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ సినిమాలో నాగార్జున కొన్ని సందర్భాల్లో ఒకే ఫ్రేమ్‌లో డ్యూయల్ రోల్‌లో కనిపించాల్సి వస్తుంది. అప్పుడు డూప్ అవసరం కాబట్టి నాగార్జున బాడీకి తగ్గట్టుగా ఉండే మరొక పర్సన్ కావాలి దీంతో ఈవివి సత్యనారాయణ నాగార్జునకు తగ్గట్టుగా శ్రీకాంత్ ఉంటాడు అని భావించి అతని వెళ్లి కలిసాడట.

Hello Brother Telugu Full Movie | Nagarjuna | Telugu Filmnagar

శ్రీకాంత్ ని కలవడానికి ముందు సత్యనారాయణ శ్రీకాంత్ కూడా ప్రస్తుతం హీరోగా చేస్తున్నాడు కదా నాగార్జునకు డూప్ గా చేయడానికి అంగీకరిస్తాడో..? లేదో..? అని అనుమాన పడ్డారట. అలాగే వెళ్లి అడగగా శ్రీకాంత్ ఈవివి సత్యనారాయణపై ఉన్న గౌరవంతో నో చెప్పలేక నాగార్జునకు డూప్ గా చేయడానికి అంగీకరించాడట. సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయి నాగార్జున పై ప్రశంసల వర్షం కురిపించింది.