చిన్నప్పటి నుండి ప్రభాస్ కి ఆ కోరికలు ఎక్కువే.. కానీ, ఏం లాభం.. తలరాత అలా తగలాడింది..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న.. రెబల్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలోకి ఈశ్వర్ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ రెబల్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చూస్తున్నారు . ఒకప్పుడు 10,000 తన సినిమాకి రెమ్యూనరేషన్ గా తీసుకునే ఈ హీరో ఇప్పుడు ఏకంగా 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలోనే నెం 1 హీరోగా పేరు సంపాదించుకున్నాడు.

కాగా ప్రజెంట్ ప్రభాస్ పేరు చెప్తే ప్రపంచ దేశాలు సైతం ఇట్టే గుర్తు పడుతున్నాయి . దానికి కారణం బాహుబలి సినిమా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నప్పటినుంచి చాలా సైలెంట్ అయిన ప్రభాస్ కు సినిమాలోకి రావడం అస్సలు ఇష్టం లేదట . పెదనాన్న ఫోర్స్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చానని స్వయంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్..” తనకు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదని బిజినెస్ చేయాలన్న కోరిక ఉందని కచ్చితంగా ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి ఎప్పటికైనా అందులో సెట్లెవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. చిన్నప్పటినుంచి ఎక్కువగా బిజినెస్ వైపు ఇంట్రెస్ట్ ఉండేదట . కానీ పెదనాన్న ఇష్టాన్ని కాదనలేక ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ తన బిజినెస్ కోరికను తెలుసుకున్న ఫ్యాన్స్ ఇండస్ట్రీలో హీరోగా చేస్తూ.. బిజినెస్ మాన్ గా సెటిల్ అవ్వచ్చు అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . అంతేకాదు త్వరగా పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు . లేకపోతే కోట్లకు కోట్ల ఆస్తి ఉంది ..ఆరడుగుల అందగాడు.. అందానికి తగ్గ హైట్.. హైట్ కి తగ్గ వెయిట్.. ఆ కట్ అవుట్ ను చూసి ఎలాంటి వారైన పడిపోవాలి.. కానీ ఇప్పటివరకు పెళ్లంటేనే భయపడిపోతున్నాడు ఈ హీరో . అయితే “వాడి తలరాత అంతే “అనుకోని సరిపెట్టుకుంటుంది వాళ్ళ అమ్మగారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అలా ఊరుకోవట్లేదు . ప్రభాస్ కి- అనుష్కకు పెళ్లి చేసే తీరతాం అంటూ మొండిగా స్ట్రాంగ్ గా కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Prabhas, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news