తెలుగు సినీ పరిశ్రమలో అలనాటి మేటి నటుడు సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో, రాజకీయ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ ఎన్టీఆర్ కోట్లాదిమంది ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎటువంటి పాత్రనైనా అవలీలగా నటించగలిగే సత్తా ఉన్న ఎన్టీఆర్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్రనైనా సరే ఒదిగిపోయి నటిస్తాడు. ఇప్పటికే ఎన్టీఆర్ వారసత్వంగా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ ని గతంలో ఓ సినిమా షూటింగ్ టైంలో సన్నివేశంలో భాగంగా ఎన్టీఆర్ ను రక్తం వచ్చేలా కొట్టాడట. ఆయన ఎవరో? అసలు విషయం ఏంటో? ఒకసారి చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక, సాంఘిక, ప్రేమ కథ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన పాండురంగడు మహత్యం సినిమా ఒకటి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పుండరీక రోల్ ప్లే చేశాడు. ఇదే సినిమాలో పేకేటి శివరం ఎన్టీఆర్ ని కూర్చితో కొట్టే సన్నివేశం ఒకటి ఉంటుంది.
ఈ సన్నివేశంలో నటించడానికి ఒప్పుకోలేదు పేకేటి శివరం. కానీ ఎన్టీఆర్ ఆయన దగ్గరికి వెళ్లి సినిమా అన్నాక ఇవన్నీ తప్పవు ఇలాంటి సన్నివేశాల్లో కూడా నటిస్తేనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటావు. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నువ్వు నటించు అని శివరాంకి సపోర్ట్ చేశారట. దీంతో షూటింగ్ మొదలైంది శివరాం ఎన్టీఆర్ నీ కొట్టడంతో వీపు పగిలి రక్తం కారిందట.
ఆ తర్వాత డైరెక్టర్ కట్ చెప్పడంతో తన వీపుపై తగిలిన దెబ్బకు మందు రాస్తూ మూవీ టీం హడావిడి చేస్తుంటే పేకాట శివరాం మాత్రం ఒక మూల కూర్చుని భయపడుతూ ఉన్నాడట. ఇదంతా గమనించిన ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి చాలా బాగా చేశావు సినిమాల్లో పర్సనల్ విషయాలు అంటూ ఏది ఉండవు. ఎటువంటి సన్నివేశం వచ్చినా నటించక తప్పదు. నేనేమీ ఫీల్ అవ్వడం లేదు నువ్వు భయపడకు అంటూ భుజంపై చేయి వేసి ధైర్యం చెప్పాడటా.