ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది జయప్రద. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకున్న ఈమె ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా ఇండస్ట్రీకి జయప్రద దూరమైంది. ఆమె కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఓ స్టార్ డైరెక్టరట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
100కు పైగా హిట్ సినిమాలను రూపొందించిన దర్శకుడు కైలాసం బాలచందర్. 50 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో పనిచేసిన ఈయన తంజావూరు దగ్గర నన్నిలం అనే గ్రామంలో 1930లో జన్మించాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, పద్మశ్రీతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్న ఈయన ఇండస్ట్రీలో రజనీకాంత్, కమలహాసన్ లాంటి చాలామంది స్టార్ హీరోలు గురువుగా భావిస్తారు. అంతటి గొప్ప దర్శకుడు అయిన ఈయన జయప్రదకు సినిమాలు రాకుండా ఆపేశాడట. ఎంతో నేచురల్ గా మధ్యతరగతి జీవితాల్లో ఎదురయ్యే సమస్యలను సినిమాల రూపంలో తెరకెక్కించాడు బాలచంద్రన్.
అలాంటి సినిమాలలో అంతులేని కథ ఒకటి. ఈ సినిమాలో బాలచందర్ గారికి హీరొయిన్ గా ఒక అందమైన అనేక రకాల ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి చూపించగలిగే స్టార్ హీరోయిన్ కావాలి. దాంతో ఈ సినిమాకు జయప్రదను సెలెక్ట్ చేశారట. ఈ సినిమాలో రజనీకాంత్- జయప్రదకు అన్నయ్య రోల్ ప్లే చేశాడు. ఏ బాధ్యతలు లేకుండ తాగుతూ తిరిగే ఇంటి పెద్ద పాత్రను రజనీకాంత్ ఈ సినిమాలో పోషించాడు ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ సాధించింది.
ఈ సినిమాలో హీరోయిన్గా బాలచందర్ జయప్రద ను తీసుకోవడం వల్ల తర్వాత ఆమెకు చాలా కాలం పాటు సినిమాల్లో అవకాశాలు రాలేదట. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ చాలా గంభీరంగా కోపంతో కనిపిస్తుంది. సౌమ్యమైన పాత్రల్లో, పాటల్లో మళ్లీ ఈమెను హీరోయిన్ గా చూపిస్తే జనాలు కనెక్ట్ అవ్వగలరు లేదో అనే ఒపీనియన్ తో దర్శకులు ఈమెకు అవకాశాలు ఇవ్వడం మానేశారట. అలా బాలచందర్ సినిమాలో హీరోయిన్ పాత్ర ఈమెకు శాపంగా మారింది. ఈ క్యారెక్టర్ వల్ల దాదాపు ఆరు నెలలపాటు ఎటువంటి అవకాశాలు జయప్రదకు రాలేదట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.