మన తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ సినిమాల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వినీ దత్.. టాలీవుడ్ లో ఉన్న మూడు తరాల అగ్ర హీరోలతో ఎన్నో హిట్ సినిమాలను నిర్మించాడు. ఇక ముఖ్యంగా అయినా మన టాలీవుడ్ సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు తో కూడా ఎన్నో హిట్ సినిమాలను నిర్మించారు.. అయితే కే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ఓ సీత కథ సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా అశ్విని దత్ తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టాడు.
ఆయన ఎంతో అభిమానించే నూటడు ఎన్టీఆర్ తో ఒక సినిమా నిర్మించాలని ఎన్నో కలలు కన్నారు. ఇక అదే సమయంలో ఎన్టీఆర్‌ను సంప్రదించి కృష్ణుడి మెడలో ఉన్న మాలకే ఎన్టీఆర్ పేరు పెట్టారు ఆ పేరే వైజయంతి మూవీస్ ఈ పేరుతోనే తన నిర్మాణ సంస్థను ప్రారంభించాడు అశ్విని దత్.. అదే విధంగా తన నిర్మాణ సంస్థ యొక్క లోగోను ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న చిత్రాన్ని ఇక ఆయన చేతిలో శంఖం మరియు భూగోళం ఉంటుంది. ఇక అశ్విని దత్ తన కెరీర్లో ఎన్టీఆర్- చిరంజీవిలతో ఎక్కువ సినిమాలు తీశారు.
అదే విధంగా బాలకృష్ణతో కూడా అశ్వమేధం వంటి పలు సినిమాలను కూడా రూపొందించారు. ఒకసారి ఓ చిత్రం షూటింగ్ విరామంలో ఎన్టీఆర్- అల్లు రామలింగయ్య మాట్లాడుకుంటున్నారు.. ఆ క్రమంలో వారి మాటల మధ్యలో చిరంజీవి నటించిన ఖైదీ, అడవి దొంగ, పసివాడి ప్రాణం లాంటి సినిమాలు, అలాగే బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు, అనసూయమ్మ గారి అల్లుడు, మువ్వా గోపాలుడు లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.
అవి చూసిన ఎన్టీఆర్ ఈ సినీ పరిశ్రమ మీ అల్లుడు చిరంజీవి, మా కొడుకు బాలయ్యదే అంటూ అల్లు రామలింగయ్య తో తరచు అనే వారిని.. తర్వాత ఎన్టీఆర్ చెప్పినట్టుగానే ఈ ఇద్దరు హీరోలు అనేక సినిమాలతో విజయం సాధించి చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోలోగా ఎదిగారని గతంలో అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.