ఈ ఏడాది వీరిద్దరూ నాకు చాలా స్పెషల్.. నిహారిక ఇంట్రెస్టింగ్ (వీడియో)

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరి జీవితం కొనసాగిస్తుంది. ఈ మధ్యనే డెడ్ ఫిక్సల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సిరీస్ లో ఆమె మాట్లాడిన బోల్డ్ డైలాగ్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం నిహారికా ప్రొడ‌క్ష‌న్ రంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా కొనసాగుతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను, ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తుంది. తాజాగా రక్షాబంధన్ సందర్భంగా ఆమె తన అన్నలకు రాఖీ కడుతున్న ఫొటోస్, వీడియోస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తన అన్నయ్యలు వరుణ్ తేజ్, చరణ్ లతో పాటు మరో అన్నకు రాఖీ కట్టింది.

ఆ రాఖీ నాకు చాలా స్పెషల్.. ఒక బ్రదర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంకో బ్రదర్ ఈ మధ్యనే తండ్రి అయ్యాడు. మరో అన్న ఐదేళ్ల తర్వాత ఇండియాకు వచ్చాడు. ఆల్ లవ్” అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చింది. తన అన్నలు తనకు ఎంతో స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)