నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలు మామూలుగా పెంచలేదు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది.
అలాగే టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల కూడా ఈ సినిమాలో బాలయ్య కూతురుగా కీలకపాత్రలో నటిస్తుంది. అలాగే శరత్ కుమార్, బాలీవుడ్ స్టార్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. అయితే ఈరోజు సాయంత్రం 4:05కు రావలసిన భగవంత్ కేసరి ఫస్ట్ సాంగ్ మూవీ టీమ్ లేట్ చేసి. గణపతి రాకకు సన్నాహాలు జరుగుతున్నాయి.. మరికొంత సేపు వేచి ఉండండి అనే ట్యాగ్ తో 5:41ని కి సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇక చాలా సేపు వెయిటింగ్ తర్వత ఫస్ట్ సాంగ్ #Ganesh Anthem ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ పాటలో బాలయ్య శ్రీలీల స్టెప్పులు కూడా అదిరిపోయాయి.మరోసారి తమన్ తన మ్యూజిక్ తో ఇరగదీసాడనే చెప్పాలి.. తమన్ మ్యూజిక్‌కు బాలయ్య శ్రీలీల వేసిన స్టెప్పులు అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా ఉన్నాయి..ఫుల్ ఆఫ్ మాస్ సాంగ్ గా ఈ పాటను తెరక్కెకించారు. 5నిమిషాల 3 సెకన్లు సాగే ఈ పాటకి బాలయ్య, శ్రీ లీల ఊర మాస్ స్టెపులతో అదరగొట్టారు. ఈ పాటతో అవీల్ ప్రేక్షకులలో మరిన్ని అంచనాలు పెంచాడనే చెప్పాలి. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం కూడా కన్ఫర్మ్ చేశాడు.