బ్యూటీ క్వీన్ శ్రీ లీలకు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పవ అవసరం లేదు. ఆమె కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతెలుగు సిని పరిశ్రమలోతలు క్యూ కడుతున్నారు. యంగ్ హీరోలు తమ సినిమాలకు ఆప్షన్‌గా శ్రీలీలనే ఎంచుకుంటున్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందD మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది శ్రీలీల.
రవితేజకూ జంటగా ధమాకా సినిమాలో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇలా ఇండస్ట్రీలోకి రావడమే ఆలస్యం పదికి పైగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇక తన కెరీర్ సెట్ అయిపోయింది.. అనుకుంటున్నా సమయంలో కొత్త సమస్య వచ్చి పడింది. కానీ ఈమధ్య శ్రీ లీలకు ఒక బెంగ పట్టుకుందట. అదేంటంటే రవితేజతో సక్సెస్ సాధించిన శ్రీ లీల… ఆ స్పీడ్ లో వరుస సినిమాలను ఒప్పేసుకుంది. అందులో ఇద్దరు ఫ్లాప్ హీరోలు ఉండడంతో తన కెరీర్ ఏమవుతుందో అని భయపడుతుందట శ్రీ లీల.
ప్రస్తుతం శ్రీ లీల మహేష్ బాబు తో గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, బాలయ్యతో భగవంత్ కేసరి ఇలా పలు సినిమాల్లో నటిస్తుంది. మరోవైపు రామ్ తో స్కంద లోను, వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, నితిన్ తో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాల్లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రామ్, వైష్ణవ్, నితిన్ ముగ్గురు గత సినిమాల్లో ఫ్లాప్ కావడంతో తన కెరీర్ కి ఏదైనా డామేజ్ అవుతుందేమోనని భయపడుతుంది శ్రీ లీల. మహేష్ బాబు సినిమాకు ముందు ఈ సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ ఉందట.
అవి ఏమాత్రం దెబ్బతీసిన తన కెరీర్ కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మదనపడుతోందట. ఇంతకుముందు కృతి శెట్టికి ఎదురైన అనుభవంతో జాగ్రత్త పడాలని ఆలోచిస్తుందట శ్రీ లీల. తనలాగే ఒక హిట్ రావడంతో వరుస సినిమాలు ఒప్పుకుని దెబ్బ అయిందని ఆలోచిస్తుందట. ఇప్పుడు తన పరిస్థితి కూడా అలాగే అవుతుందేమోనని జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుందట ఈ బ్యూటీ. ఇక ఈమె టెన్షన్ తగ్గాలంటే రామ్, వైష్ణవ్, నితిన్ సినిమాలు హిట్ అవ్వాలి.