ఎన్టీఆర్ vs పవన్ కళ్యాణ్ మునుపన్నడు చూడని బాక్స్ ఆఫీస్ యుద్ధం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ దేవర ‘ తెరకక్కనుంది. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ బ్యానర్ పై నిర్మిస్తున్నారు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవిలో మ‌రో హీరోయిన్‌గా రష్మిక మంద‌న , మృనాల్ ఠాగూర్‌ల‌లో ఒకరు హీరోయిన్ గా ఉండబోతున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఇక ఈ ఏప్రిల్ 5న మూవి రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీం ఇటీవల అఫీషియల్ గా ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ ఓజి ‘ మొదటి నుంచి అందరిలో భారీ హైప్ సంపాదించింది. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్. థ‌మన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా రానున్న డిసెంబర్లో రిలీజ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం దీనిని 2024 సమ్మర్‌లో విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నారట. సరిగ్గా దేవరా రిలీజ్ కి ఓ వారం అటు ఇటుగా ఓజిని కూడా రిలీజ్ చేయబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అటు పవర్ స్టార్ ఇటు యంగ్ టైగర్ లో సినిమాల మధ్య బాక్సాఫీస్ వ‌ద్ద‌ గట్టి పోటీ జరగనుంది. అయితే ఓజి రిలీజ్ డేట్ పక్కాగా మూవీ టీం అనౌన్స్ చేస్తే తప్ప దీనిపై క్లారిటీ రాదు.