తిరుపతి దర్శనమైన వెంటనే కాణిపాక, శ్రీకాళహస్తి, కాంచీపురంతో పాటు శ్రీపురం లో ఉన్న లక్ష్మీదేవి ఆలయానికి కూడా వెళుతూ ఉంటారు చాలామంది భక్తులు. సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి కొలువైనట్లు ఉండే ఆ ఆలయం బంగారుకాంతులతో ఎల్లవేళలా మెరిసిపోతూ ఉంటుంది. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనేంతగా కాంతులతో ప్రకాశిస్తుంది. రాత్రివేళ ఈ ఆలయాన్ని చూసిన భక్తులు జీవితం మొత్తం గుర్తుంచుకునే అంత అందంగా ఆలయం కనిపిస్తూంది.
ఇక తిరుపతి కొండ నుంచి శ్రీపురం చెరే మార్గాలంటటటో ఒకసారి చూద్దాం. తిరుపతి కొండపై నుంచి నేరుగా శ్రీపురం చేరడానికి బస్సులు ఉంటాయి. తిరుపతి నుంచి అక్కడికి చేరడానికి 4 గంటల సమయం పడుతుంది. టికెట్ ప్రస్తుతం రూ.147 బస్సులు వెల్లూరు బస్టాండ్( గోల్డెన్ టెంపుల్ ) వరకే వెళ్తాయి. అక్కడి నుంచి బస్సులు లేదా ఆటోలు కూడా ఉంటాయి రూ.10 చార్జ్ చేస్తారు. గోల్డెన్ టెంపుల్ నుంచి అరుణాచలం, కాంచీపురం వెళ్లడానికి బస్సులు ఉన్నాయి.
అరుణాచలం అయితే 2 :30 గంటలు, కాంచీపురం అయితే 2 గంటలు పడుతుంది. ఇక తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లే భక్తులకు అయితే అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ కి బస్సులు, జీప్‌లు కూడా దొరుకుతాయి. ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. రాత్రి 8 గంటలు దాటితే గుడిలోకి అనుమతించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముందుగానే అక్కడ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే ఈ అందమైన ఆలయంతో పాటు లక్ష్మీదేవి వారి దర్శనాన్ని కూడా చేసుకోవచ్చు.