విజ‌య‌శాంతికి బాల‌య్య పెట్టిన ముద్దు పేరు ఇదే.. ప్రేమ‌తో అలా పిలుస్తాడా…!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ – విజయశాంతి కాంబినేషన్ అంటేనే మూడు దశాబ్దాల క్రితం ఒక క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో బాలయ్య – విజయశాంతి జోడిగా సినిమా వస్తుందంటే చాలు మాస్ ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోయేవారు. దాదాపు దశాబ్ధ‌ కాలం పాటు ప్రతి ఏడాది విజయశాంతి – బాలయ్య కాంబినేషన్లో సినిమా వచ్చేది.

బాలయ్య విజయశాంతి కలిసి నటిస్తున్నారు అంటే ? ట్రేడ్ వర్గాల్లోనూ ప్రి రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగేది. కేరీర్ ప్రారంభంలో బాలయ్య ఎక్కువగా సుహాసిని, రజిని లాంటి హీరోయిన్లతో నటించారు. విజయశాంతి ఎంటర్ అయ్యాక 1991 ప్రారంభం వరకు ఆమెతోనే కంటిన్యూగా సినిమాలు చేస్తూ వచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో చివరగా వచ్చిన సినిమా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన నిప్పురవ్వ.

అప్పట్లో బాలయ్య – విజయశాంతి స్నేహం పై రకరకాల గుసగుసలు ఉండేవి. వీరిద్దరూ కావాలని పాటలను కాశ్మీర్లోను, ఊటీలోను పెట్టించుకుని అక్కడ బాగా ఎంజాయ్ చేసేవారని అనేవారు. వెండితెర మీదే కాదు బ‌య‌ట కూడా వీరి కెమిస్ట్రీ సూప‌ర్ అన్న టాక్ ఉండేది. ఇక బాలయ్య విజయశాంతిని.. ముద్దుగా శాంతి శాంతి అని పిలిచేవారట.

Dhora Muddu Pettanela Full HD Video Song | Kathanayakudu Movie |  Balakrishna,Vijayashanti | SP Music - YouTube

షూటింగ్‌లో ఎంతమంది ఉన్నా కూడా చాలా చనువుగా ఉండడంతో పాటు.. శాంతి ఇటురా, శాంతి ఇదేంటో చూడు అని పదేపదే పిలిచేవారట. వీరిద్దరిచ‌నువు చూసిన దర్శక నిర్మాతలు కూడా కావాలని ఈ జంట కాంబినేషన్ లోనే సినిమా తీయాలని ముందుగానే ఫిక్స్ అయ్యి.. వీరిని ఎంకరేజ్ చేసే వారని కూడా అప్పట్లో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించేవి.

Tags: balayya, film news, filmy updates, intresting news, latest news, latest viral news, nadamuri balakrishna, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news