శరత్ బాబు చివరి కోరికకు కమలహాసన్‌కు ఉన్న లింకేంటి… ఇంత ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఉందా…!

శరత్ బాబు, కమల్ హాసన్ కలసి ఎన్నో చిత్రాలలో నటించారు. వాటిలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ “సాగరసంగమం, స్వాతిముత్యం” సినిమాలు కూడా ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో కమలహాసన్ అభినయం చూసి మన దేశం నుంచి యాక్టింగ్ లో ఆస్కార్ అవార్డు అంటూ వస్తే అది కమలహాసన్‌కు వస్తుందంటూ శరత్ బాబు ఆ సమయంలో అనేవారు.. ఆయన మాటలను విశ్వనాథ్ సైతం ఎంతో గౌరవించే వారట.. ఆ విధంగా సమయంలో కమల్‌కు ఆస్కార్ అంటూ అప్పట్లో న్యూస్ పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి.

Sarath Babu: சரத்பாபுவால் வாழ்க்கையை தொலைத்த பிரபல நடிகை... ரகசியமாக உதவிய  இயக்குநர்... | Sarath Babu cheating on popular actress Rama Prabha is  trending on social media - Tamil Filmibeat

సాగర సంగమం, స్వాతిముత్యం సినిమాల కన్నా ముందే కమల్ హాసన్ కు ‘మూండ్రం పిరై’తో 1983 లోనే ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు కూడా వచ్చింది.. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాయికన్ సినిమాతో జాతీయస్థాయిలో ఉత్తమ నటుడిగా కమల్‌కు మరో అవార్డు వరించింది. ఇలా మూడోసారి శంకర్ ‘భారతీయుడు’తో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు కమల్. ఉత్తమ నటుడిగా మూడుసార్లు నేషనల్ అవార్డు అందుకున్న తొలి నటుడిగా కమల్ రికార్డ్ సృష్టించారు.

ఈ క్రమంలోనే తన మిత్రుడు కమల్ హాసన్‌కు ఆస్కార్ రావాలని శరత్ బాబు ఎంతో ఆశపడ్డారు.. అయితే అప్పట్లో మన సినిమాలను ఆస్కార్ బరిలో జనరల్ కేటగిరీలో నిలపడానికి ఇప్పటిలా నిబంధనలు సులువుగా లేవు. అందువల్ల శరత్ బాబు కోరుకున్నట్లుగా క‌మ‌ల్‌కు అప్పుడు ఆస్కార్ దక్కలేదు. పైగా కమల్ హాసన్ సైతం ఆస్కార్ అవార్డులు కేవలం హాలీవుడ్, ఇంగ్లీష్ సినిమాలకు మాత్రమే పరిమితం అని మన దేశంలో ఇచ్చే నేషనల్ అవార్డులే మనకు ఆస్కార్ అని ఆయన తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు.

ఏది ఏమైనా శరత్ బాబు కోరుకున్నట్టు ఇప్పుడు మ‌న సినిమాల‌కు ఆస్కార్ అవార్డుల్లో జనరల్ కేటగిరీలోనూ ఎంట్రీ పొందే అవకాశం సుగమమైంది. ఈ క్రమంలోనే శ‌రత్ బాబు కోరుకున్నట్లుగా కమల్ హాసన్ ను ఆస్కార్ వరిస్తుందో లేదో చూడాలి.