సినిమా పరిశ్రమలో మరో విషాదం.. త్రిబుల్ ఆర్ స్కాట్ దొర కన్నుమూత

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వరుస మరణాలు సెలబ్రిటీలను, అభిమానులను ఎంతో దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే చాలామంది అగ్ర‌ న‌టులు ఒకరి తర్వాత ఒకరు ఆకస్మిక మరణాలకు గురి అవుతున్నారు. మరి కొంతమంది అవయవాలు పనిచేయక మరణిస్తే… మరి కొంతమంది ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణిస్తున్నారు. ఇంకొంతమంది గుండెపోటుతో మరణిస్తూ అందరిని భాద‌పెడుతున్నారు.

RRR Movie on Twitter: "#RayStevenson, it's a pleasure to have you play the  lead antagonist #SCOTT in #RRRMovie. Can't wait to begin shooting with you.  #RRR. https://t.co/T0nZnHlMxy" / Twitter

ఈ నిన్నటికి నిన్న టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ఆర్గాన్స్ పనిచేయక కన్నుమూయగా ఇప్పుడు మరొక నటుడు కూడా మరణించి చిత్ర ప‌రిశ్ర‌మ‌ను శోకసంద్రంలో ముంచేశారు. టాలీవుడ్‌లో ఒక మైలురాయిగా నిలిచిన సినిమాలో త్రిబుల్ ఆర్ కూడా ఒక‌టి. ఈ సినిమాలోని ప్రతి ఒక్క నటుడు కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎంతో అద్భుతమైన నటనను ప్రదర్శించారు.

Rrr:कौन हैं आरआरआर के विलेन रे स्टीवेन्सन? इससे पहले 'थॉर' में दिखा चुके  हैं दम - Rrr Villain Hollywood Actor Ray Stevenson Know All About -  Entertainment News: Amar Ujala

అంతే అద్భుతమైన నటనను ఇందులో రే స్టీవెన్సన్ కూడా బ్రిటిష్ అధికారిగా అంతే అద్భుతంగా నటించారు. ఇక తన పాత్రకు పూర్తిస్థాయిలో ఆయన న్యాయం చేశారని చెప్పాలి. అలాంటి నటుడు ఈరోజు మరణించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో బ్రిటిష్ ఎంపరర్ స్కాట్ దొరగా ప్రధాన పాత్రలో నటించిన రే స్టీవెన్సన్ కేవలం 58 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే ఆయన మరణానికి గల కారణాలు ఏంటనే విషయం మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు.