ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్‌… మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల‌కూ ఓకే…!

టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ కాంబినేషన్ గా రూపొందుతున్న వార్ 2 ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లకుండానే విడుదల తేదీ లాక్ చేసుకుంది. 2025 జనవరి 24 రిలీజ్ చేయాలని యష్ రాజ్ ఫిలింస్ డెడ్ లైన్ పెట్టేసుకుందట. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కంప్లీట్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. తెలుగులో ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్స్‌కు పూర్తి భిన్నంగా పవర్‌ఫుల్ రోల్‌లో ఎన్టీఆర్ అభిమానులను సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లు చెబుతోన్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్‌, హృతిక్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

ఇది దృష్టిలో పెట్టుకునే మొన్న తారక్ పుట్టినరోజుకి హృతిక్ శుభాకాంక్షలు చెబుతూ యుద్ధభూమిలో కలుసుకుందామని హింట్ ఇచ్చాడు. ఈ సినిమా నుంచి ఇంతకు మించిన లీక్స్ పెద్దగా లేవు. స్క్రిప్ట్ లాక్ చేయడం అయిపోయింది కానీ హీరోల డేట్లు ఫైనల్ చేసుకోవాలి. జూనియర్ ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ సినిమాతో పాటు వార్ 2 షూటింగులు స‌మాంత‌రంగా చేస్తూ ఉంటాడు.

NTR 30 is Devara: From Cast to Release Date, All You Need to Know About Jr  NTR, Janhvi Kapoor and Saif Ali Khan's Upcoming Telugu Film | 🎥 LatestLY

జనవరి నుంచి ఎక్కువ శాతం డేట్లు అయాన్ కి ఇచ్చేస్తాడు. ఇక ప్ర‌శాంత్ నీల్ సినిమాకు డిసెంబ‌ర్ నుంచి డేట్లు ఇస్తాడ‌ని.. అప్పుడే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంద‌ని టాక్‌. ఇలా పది నెలల గ్యాప్ లో దేవర, వార్ 2 రెండూ థియేటర్లలోకి వచ్చేస్తాయి. ఈలోగా మరో రెండు కమిట్ మెంట్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. దర్శకులెవరన్నది డిసైడయ్యాక ప్రకటనలు వచ్చేస్తాయి.