ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన సరే ముందుగా స్క్రీన్ పై ఈ చిన్నది కనిపించాల్సిందే. థియేటర్లో సినిమా మొదలు అవగానే ముందుగా వచ్చే ‘ఈ నగరానికి ఏమైంది… ఓ వైపు పొగ…మరోవైపు నుసి… ఎవ్వరూ నోరుమెదపరేంటి…’ అంటూ ఒక యాడ్ వస్తుంది. ఇది సినిమా ప్రారంభానికి ముందు ఆ తర్వాత ఇంటర్వెల్ లో మరోసారి వచ్చే ఈ యాడ్ అందరికీ గుర్తండే ఉంటుంది.
ఇక ఇప్పుడు ఆ యాడ్‌లో నటించిన చిన్నపాపను ఎవరూ మర్చిపోలేరు. తండ్రి సిగరెట్ తాగుతుంటే… ఆ చిన్న పాప అమాయికంగా చూసే చూపుల వల్ల సిగరెట్ పడేసి వస్తాడు అతను. ఈ యాడ్ చూసి ఎంత మంది సిగరెట్ తాగడం మానేశారో తెలీదు కానీ.. ఆ పాపకి మాత్రం మంచి పాపూలారిటీ వచ్చింది. ఇక ఆ చిన్న పాప పేరు సిమ్రాన్ నటేకర్. ఈమె 1997లో ముంబైలో పుట్టింది.
చిన్న వయ్యసులోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ యాడ్ తర్వాత సుమారు 150కి పైగా పలు యడ్‌లో నటించి మెప్పించింది. తర్వాత చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌లలో కూడా పూజ పాత్రతో నటించి మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో వచ్చిన క్రిష్3 మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్‌లో కూడా నటించింది. అదే విధంగా 2010లో వచ్చిన రితీష్ దేశ్ ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ కలిసి నటించిన జానే కహాన్ సే ఆయీ హై సినిమాలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
అయితే ఇప్పటికి తన నటినా ప్రతిభను చూపించేందు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తుంది సిమ్రాన్ నటేకర్. దీంతో ఈ ముంబై చిన్నది మంచి ఆవకాశలు కోసం టాలీవుడ్ పై కన్నేసిందట. అదే విధంగా సోషల్ మీడియలో కూడా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా జనాల మతులు పొగొట్టడం మొదలుపెట్టేసింది.
View this post on Instagram