ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య లాస్ట్ ఛాన్స్‌…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న బాలయ్య హ్యాట్రిక్ విజయంపై కూడా కన్నేసాడు. బాలకృష్ణ- అనిల్ రావిపూడి తో చేస్తున్న భగవంత్ కేసరి కూడా దసరా కనకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసాయి.

అనిల్ రావిపూడి కూడా ఈ సినిమాను తన గ‌త సినిమాలకు భిన్నంగా మాస్ యాక్షన్ సినిమాగా తెర్కెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.అయితే ఇప్పుడు గతంలో బాలయ్యకు బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందించిన బ్లాక్ బస్టర్ సీనియర్ దర్శకుడు బి గోపాల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. గతంలో బాలయ్యకు బి గోపాల్ రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి వంటి ఇండస్ట్రీ హిట్ విజయాలనులను అందించాడు.

వీరి కాంబినేషన్లో చివరగా పల్నాటి బ్రహ్మనాయుడు వచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. అయితే ఇప్పుడూ బి.గోపాల్ బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. అదేవిధంగా ఈ సినిమాతో తన రిటైర్మెంట్ కూడా ప్రకటించనున్నాడట. రీసెంట్గా బి గోపాల్ తిరుమలలో కనిపించినప్పుడు కూడా బాలకృష్ణతో సినిమా చేస్తానని కూడా ప్రకటించాడు.

బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథను రెడీ చేస్తున్నామని ఆయన డేట్స్ సర్దుబాటు అవగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని బి గోపాల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాలయ్య కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారని..ఆయన ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందని గోపాల్ పరోక్షంగా వెల్లడించారు. అయితె బాలయ్య ఈ దర్శకుడుకి చివరి సినిమా అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.